Venu Goapl Reddy
Author- NTV Telugu-
Uttar Pradesh: యూపీ అల్లర్లలో 337 మందిని అరెస్ట్ చేసిన యోగీ సర్కార్
ఉత్తర్ ప్రదేశ్ అల్లర్లలో యోగీ సర్కార్ పట్టుబిగిస్తోంది. అల్లర్లకు కారణం అయిన వారిని వరసగా అరెస్ట్ చేస్తోంది. ఇటీవల బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళనలను చేశారు. అయితే చాలా వరకు శాంతియుతంగానే నిరసనలు తెలిపినా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా యూపీలోని కాన్పూర్, ప్రయాగ్ రాజ్, సహరాన్ పూర్, హత్రాస్ ఇలా కొన్ని ప్రాంతాల్లో అల్లరి […] -
Rahul Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో నేడు మరోసారి ఈడీ విచారణ
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతల విచారణ సాగుతోంది. సోమవారం రోజు విచారణలో భాగంగా కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. అయితే మంగళవారం ( జూన్14)న కూడా విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. దీంతో రాహుల్ గాంధీని నేడు కూడా విచారించనుంది ఈడీ. సోమవారం విచారణకు హాజరైన రాహుల్ గాంధీని ఈడీ దాదాపుగా 10 గంటల పాటు విచారించింది. సోమవారం ఉదయం ప్రారంభం అయిన విచారణ రాత్రి […] -
Vishwa Hindu Parishad: దేశవ్యాప్త హింసకు వ్యతిరేకంగా ‘హనుమాన్ చాలీసా’
ఇటీవల బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు గత వారం దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళనలు చేస్తున్నారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే సమయంలో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ముఖ్యంగా యూపీలోని ప్రయాగ్ రాజ్, కాన్పూర్, సహరాన్ పూర్ ప్రాంతాల్లో రాళ్ల దాడులు జరిగాయి. జార్ఖండ్ రాంచీలో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. పోలీసులకు, ఆందోళనకారుల ఘర్షణల్లో ఇద్దరు మరణించారు. పశ్చిమ బెంగాల్ హౌరాలో […] -
Prophet Remarks: నుపుర్ శర్మ వ్యాఖ్యలపై స్పందించిన చైనా
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల దుమారం చెలరేగుతూనే ఉంది. గత వారం నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ వివాదంపై ఇస్లామిక్ ప్రపంచం భారత్ కు తమ నిరసననను తెలియజేశాయి. ఖతార్, మలేషియా, ఇరాక్, యూఏఈ, సౌదీ ఇలా చాలా దేశాలు భారత రాయబారులకు నిరసన తెలిపాయి. దీనికి బదులుగా ఇండియాకు కూడా వివరణ ఇచ్చింది. వ్యక్తి గత వ్యాఖ్యలను ప్రభుత్వానికి […] -
Chhattisgarh: బోరు బావిలో బాలుడు.. 60 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్
చత్తీస్ గఢ్ లోని జాంజ్ గిర్ -చంపా జిల్లాలో 10 ఏళ్ల బాలుడు బోర్ బావిలో పడిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పిహ్రిద్ గ్రామంలో ఇంటి వెనకాలు ఉన్న పెరట్లో ఆడుకుంటున్నరాహుల్ సాహు అనే బాలుడు నిరుపయోగంగా ఉన్న బావిలో జూన్ 10న పడిపోయాడు. అప్పటి నుంచి బాలుడిని బయటకు తీసుకువచ్చేందుకు రక్షణ చర్యలు సాగుతున్నాయి. దాదాపుగా 62 అడుగుల లోతులో ఇరుక్కున్నాడని రెస్య్కూ సిబ్బంది చెబుతోంది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ( ఎన్డీఆర్ఎఫ్), […] -
Jammu Kashmir: ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదుల హతం
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. వరసగా జరుగుతున్న ఎన్ కౌంటర్లలో ఉగ్రవాదులను లేపేస్తున్నాయి భద్రతా బలగాలు. ఇటీవల కాలంలో దాదాపుగా రోజు ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. తాజాగా కాశ్మీర్ లోని బెమీనా ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి బలగాలు. చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులను నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఎన్ కౌంటర్ లో ఒక పోలీసుకు స్వల్పగాయాలయ్యాయి. గతంలో సోపోర్ ఎన్ […] -
Gautam Gambhir: నుపుర్ శర్మకు మద్దతు.. వారి మౌనం చెవిటిదని ట్వీట్
మాజీ బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు దేశం లోపల, బయట రచ్చకు కారణం అయ్యాయి. పలు ఇస్లామిక్ దేశాలు భారత్ కు తన నిరసన వ్యక్తం చేశాయి. అయితే భారత్ కూడా ఇదే స్థాయిలో వ్యక్తులు చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వానికి ఆపాదించవద్దని సూచించింది. నష్టనివారణ చర్యల్లో భాగంగా బీజేపీ నుపుర్ శర్మతో పాటు నవీన్ జిందాల్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తన వ్యాఖ్యలపై నుపుర్ శర్మ క్షమాపణలు […] -
TRS: కేసీఆర్ జాతీయ రాజకీయాలకు ఎన్నారైల మద్దతు
జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ రావడాన్ని చాలా మంది స్వాగతిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు తమ అధినేత నిర్ణయానికి మద్దతుగా నిలుస్తున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా.. టీఆర్ఎస్ పార్టీ మాత్రం తమ అధినేత దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కోరుకుంటున్నారు. తాజాగా కేసీఆర్ నిర్ణయానికి ఎన్నారైలు మద్దతు ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వం జాతీయ రాజకీయాలకు అవసరం అని వారంతా అన్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ నాయకత్వం అవసరంపై తెలంగాణ ఎన్నారై మహేష్ బిగాల ప్రపంచ […] -
Harish Rao: మనం విడిపోయి అభివృద్ధి చెందాం..వారు వెనుకపడి పోయారు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై మంత్రి హరీష్ రావు కీలక కామెంట్లు చేశారు. ఇరు రాష్ట్రాల అభివృద్ధిని పోలుస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం మన అదృష్టమని ఆయన అన్నారు. తాగునీరు, సాగునీరు, మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేసుకున్నామని.. విడిపోయి మన అభివృద్ధి చెందితే , వారు వెనుకపడి పోయారని అన్నారు. ఇతర రాష్ట్రాలకు పోయి చూస్తే మన తెలంగాణ ఎంత అభివృద్ది చెందిందో తెలుస్తుందని ఆయన అన్నారు. కేంద్రం అన్ని ప్రభుత్వం ఆస్తులను […] -
Jamaat Ulama-e-Hind: ఇస్లాం ప్రకారం నుపుర్ శర్మను క్షమించాలి.. ఫత్వా జారీ చేస్తాం
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. అరబ్ సమాజం కూడా ఈ వ్యాఖ్యలపై భారత్ కు తమ నిరసన తెలిపాయి. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను శిక్షించాలని అంటూ శుక్రవారం ప్రార్థనల తర్వాత పలు ప్రాంతాల్లో నిరసలు, ఆందోళనలు చెలరేగాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో నిరసలు హింసాత్మకంగా మారాయి. పశ్చిమ బెంగాల్ హౌరాలో, జార్ఖండ్ రాంచీలో, యూపీ ప్రయాగలో హింసాత్మక ఘటనలు […]
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!