India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Wholesale Inflation: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల సామాన్య, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ను పూర్తిగా కుదేలు చేస్తోంది. ఇప్పటికే ఆకాశాన్నంటిన కూరగాయలు, పప్పులు, వంట నూనెల ధరలతో సతమతమవుతున్న ప్రజలకు తాజా ద్రవ్యోల్బణం గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో టోకు ద్రవ్యోల్బణం (WPI) నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. అక్టోబర్ నెలలో ఏకంగా 12.3%గా నమోదవ్వడం, వరుసగా రెండో నెల కూడా రెండంకెల స్థాయిలోనే కొనసాగడం ఆర్థిక వర్గాలను కలవరపెడుతోంది. టోకు ధరల పెరుగుదల ప్రభావం క్రమంగా రిటైల్ మార్కెట్‌పై పడితే, రానున్న రోజుల్లో నిత్యావసరాల ధరలు మరింత భగ్గుమనే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
గతేడాదితో పోలిస్తే నిత్యావసరాల ఖర్చులు భారీగా పెరగడంతో మెజారిటీ కుటుంబాలపై మోయలేని ఆర్థిక భారం పడింది. ఈ పరిస్థితులను తట్టుకునేందుకు చాలా కుటుంబాలు తమ నెలవారీ ఖర్చులను భారీగా తగ్గించుకుంటున్నాయి. దిగువ మధ్యతరగతి (బిలో మిడిల్ క్లాస్) ప్రజలు బయట హోటళ్లలో తినడం పూర్తిగా మానేయగా, మధ్యతరగతి కుటుంబాలు షాపింగ్, వినోద ఖర్చులకు కత్తెర వేస్తున్నాయి. అంతేకాకుండా, సగానికి పైగా కుటుంబాలు నిత్యావసర వస్తువులను చాలా పరిమితంగా కొనుగోలు చేస్తున్నాయి. చాలా మంది పాలు, పాల ఉత్పత్తులు, ఇతర ప్రోటీన్ ఆహార పదార్థాల వాడకాన్ని తగ్గించుకోగా.. పండ్లు, కూరగాయల కొనుగోళ్లపైనా నియంత్రణ పెట్టుకుంటున్నారు. ఖరీదైన బ్రాండ్లు వాడే వారంతా ఇప్పుడు తక్కువ ధరకు లభించే సాధారణ బ్రాండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంటి ఖర్చులు గడవక కొందరు తమ పొదుపు సొమ్మును వాడుకుంటుంటే, మరికొందరు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది.
Also Read
- Gold and Silver Price Crash: మళ్లీ కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. వెండి రూ.6 వేలు, బంగారం రూ.3 వేలు పతనం..!
- Akvan Cyclone: అక్వాన్ తుఫాన్ ముప్పు.. హోంమంత్రి అనిత సమీక్ష.. అత్యవసర సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్లు..
- 38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
- IFFI అవార్డుకు నామినేట్ అయిన తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా చరిత్ర సృష్టించిన ‘మయసభ’..!
ద్రవ్యోల్బణం ఇంతలా పెరగడానికి ప్రధానంగా ఇంధనం, విద్యుత్, తయారీ రంగాల్లో ధరల పెరుగుదలే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అక్టోబర్ నెలలో ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం 26 నుంచి ఏకంగా 33 శాతానికి ఎగబాకింది. ముఖ్యంగా ముడి చమురు, సహజ వాయువు ధరల పెరుగుదల ప్రభావం తీవ్రంగా ఉంది; ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 57.3 శాతం నుంచి 70.8 శాతానికి చేరుకుంది. మరోవైపు, మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలోనూ ద్రవ్యోల్బణం 9.5 శాతంగా నమోదైంది. వస్త్రాలు, రసాయనాలు, రబ్బర్ ఉత్పత్తులు, లోహాలు, విద్యుత్ పరికరాల ధరలు పెరగడం ఇందుకు దారితీసింది. ఉత్పత్తి వ్యయం (ప్రొడక్షన్ కాస్ట్) విపరీతంగా పెరగడంతో కంపెనీలు ఆ భారాన్ని ఎంతో కాలం భరించలేవని, ఫలితంగా రానున్న నెలల్లో తయారీ ఉత్పత్తుల ధరలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అక్టోబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం (CPI) 6.09 శాతానికి చేరగా, ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా 8.94 శాతంగా నమోదైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్దేశించిన 6 శాతం గరిష్ట పరిమితిని రిటైల్ ద్రవ్యోల్బణం దాటేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ధరలను అదుపులోకి తెచ్చేందుకు ఆర్బీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని సామాన్యుల నుంచి ఆర్థిక నిపుణుల వరకు అందరి దృష్టి డిసెంబర్లో జరగనున్న ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష (MPC) పైనే నిలిచింది.
తాజావార్తలు
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
Chiranjeevi: నాతో సినిమా చేస్తావా అని ఏ డైరెక్టర్ని అడగలేదు.. ఈ దుర్మార్గుడు హ్యాండిచ్చాడు!
-
BJP Slams Rahul Gandhi: ‘భారత్ ఆర్థిక విపత్తు అంచున ఉంది’.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర విమర్శలు!
-
Gold and Silver Price Crash: మళ్లీ కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. వెండి రూ.6 వేలు, బంగారం రూ.3 వేలు పతనం..!
-
Chiru Leaks: చిరు లీక్స్.. ‘కాకా’లో అసలు సస్పెన్స్ రివీల్ చేసిన చిరంజీవి!
ట్రెండింగ్
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..
-
SRH-IPL 2027: హెడ్‌కు గుడ్‌బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్‌కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!