Donald Trump: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్తాన్ వివాదాన్ని తానే ఆపినట్లు చెప్పాడు. భారత్-పాకిస్తాన్ సైన్యాల మధ్య ప్రత్యక్ష చర్చల తర్వాతే సైనిక చర్య నిలిపేశామని, ఇందులో మూడో పక్షం ప్రమేయం లేదని ప్రధాని మోడీ, ట్రంప్‌కి తేగేసి చెప్పి కొన్ని గంటలకు అవ్వకముందే మరోసారి ట్రంప్ ‘‘నేనే యుద్ధం ఆపాను’’ అంటూ ప్రకటించుకున్నారు.
Himanta Biswa Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ మరోసారి కాంగ్రెస్, రాహుల్ గాంధీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలు ఎల్లప్పుడూ మతతత్వ శక్తులను రక్షించాలని కోరుకుంటున్నాయని చెప్పారు. రాష్ట్రంలో దేవాలయాలపై మాంసం ముక్కలు విసిరేసిన సంఘటనల్లో పాల్గొన్న వారిని రక్షిస్తున్నారని ఆరోపించారు.
Israel Iran War: ఇరాన్ అణు కార్యక్రమాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులకు పాల్పడింది. ఈ రెండు దేశాలు గత 6 రోజులుగా వైమానిక దాడులు చేసుకుంటున్నాయి. మిడిల్ ఈస్ట్ సంఘర్షణపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ దాడుల తర్వాత ‘‘ప్రపంచం విపత్తుకు మిల్లీ మీటర్ల దూరంలో ఉంది’’ అని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా బుధవారం అన్నారు.
Air India Plane Crash: గత వారం జరిగిన అహ్మదాబాద్ ఎయిరిండియ ప్రమాదంలో మరణించిన వారి గుర్తింపు వేగవంతంగా జరుగుతోంది. విమానంలో 242 మంది ఉంటే ఇందులో ఒక్కరు మినహా అందరూ మరణించారు. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటంతో ప్రయాణికుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో, మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు చేస్తున్నారు.
Sonam Raghuvanshi Case: దేశవ్యాప్యంగా సంచలనంగా మారిన హనీమూన్ మర్డర్ కేసులో రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత నెల 23న మేఘాలయలో రాజా రఘువంశీ అనే వ్యక్తిని, అతడి భార్య సోనమ్ దారుణంగా హత్య చేయించింది. సోనమ్ తన లవర్ రాజ్ కుష్వాహాతో కలిసి మర్డర్ ప్లాన్ చేసింది.
Goa: పెళ్లి చేసుకొందామని గోవాకు తీసుకెళ్లి ఒక అమ్మాయిని ఆమె లవర్ చంపేశాడు. దక్షిణ గోవాలో తన ప్రియురాలిని హత్య చేసిన కేసులో 22 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె మృతదేహాన్ని ప్రతాప్ నగర్ అటవీ ప్రాంతంలో లభించింది. వివాహం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ జంట బెంగళూర్ నుంచి గోవాకు వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ, వీరి మధ్య వివాదం హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది.
Extramarital affair: లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన కేసులో, తండ్రి మరణానికి 9 ఏళ్ల కొడుకు సాక్ష్యంగా మారాడు. జూన్ 07 రాత్రి రాజస్థాన్‌లోని అల్వార్ లోని ఖేర్లి ప్రాంతంలో జరిగిన ఈ హత్య బాలుడి ద్వారా వెలుగులోకి వచ్చింది. తన తండ్రిని తల్లి, తన ప్రియుడితో కలిసి ఎలా కాంట్రాక్ట్ కిల్లర్లతో కలిసి హత్య చేయించిందనే వివరాలను వెల్లడించాడు. మాన్ సింగ్ జాతవ్ అనే వ్యక్తి ఇంట్లో చనిపోయాడు. అయితే, ప్రారంభంలో అతడి భార్య […]
Iran: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘ఇరాన్ ఎప్పటికీ లొంగిపోదు. అమెరికా సైనిక జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం జరుగుతుంది’’ అని హెచ్చరించారు. అంతకుముందు రోజు ట్రంప్ తన ట్రూత్ సోషల్ ద్వారా ‘
Mohsen Fakhrizadeh: ఇజ్రాయిల్ ఆపరేషన్ ఎలా ఉంటాయో చూడాలంటే, తాజాగా ఇరాన్ దాడులే నిదర్శనం. అత్యంత ఖచ్చితత్వంతో దాడులు నిర్వహిస్తోంది. ఇరాన్ అణు శాస్త్రవేత్తల్ని వారి బెడ్రూంలోకి దూరి మరీ చంపేస్తోంది. వీరిలో పాటు కీలకమైన మిలిటరీ జనరల్స్‌ని అత్యంత ఖచ్చితత్వంతో హతమార్చింది. ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మొసాద్ ఈ ఆపరేషన్స్ నిర్వహిస్తుందని ఇరాన్ ఆరోపిస్తోంది.
Iran Attacks Israel: ఇరాన్ అణు కార్యక్రమాలే టార్గెట్‌గా శుక్రవారం నుంచి ఇజ్రాయిల్ ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ పేరుతో వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో ఇరాన్ అణు ఫెసిలిటీలు, అణు శాస్త్రవేత్తలు, మిలిటరీ టాప్ జనరల్స్‌ని టార్గెట్ చేసి చంపేసింది. ఇదిలా ఉంటే, ఈ దాడికి ప్రతీకారంగా ఇరాన్ ‘‘ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3’’ పేరుతో ఇజ్రాయిల్ పైకి క్షిపణి దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్‌కి ఉన్న బలమైన ఎయిర్ డిఫెన్స్ ఇన్కమింగ్ […]