Strait of Hormuz: మిడిల్ ఈస్ట్ సంక్షోభం రోజురోజుకు పెరుగుతోంది. ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పరిస్థితులు వేడెక్కాయి. ఈ ఘర్షణలు ఏడో రోజుకు చేరకున్నాయి. ఇరు దేశాలు వైమానిక దాడులు, క్షిపణి దాడులు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్‌తో వివాదం పెరుగుతున్న నేపథ్యంలో ‘‘హార్మూజ్ జలసంధి’’ని ఇరాన్ మూసివేయవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇదే జరిగితే, ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభం తప్పదు.
Shashi Tharoor: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో భేటీ అవ్వడం, ఆయనకు లంచ్ ఆతిథ్యం ఇవ్వడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉగ్రవాద దాడి వెనక అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడని, దాదాపు 3000 మందిని చంపిన అతను పాకిస్తాన్ లోని అబోటాబాద్ ఆర్మీ క్యాంప్ సమీపం దాక్కున్న విషయాన్ని థరూర్ గుర్తు చేశారు.
Israel Iran War: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ‘‘ఇకపై ఉనికిలో ఉండటానికి వీలులేదు’’ అని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కాట్జ్ గురువారం అన్నారు. ఖమేనీని చంపేస్తామని చెప్పకనే చెప్పారు. గురువారం టెల్ అవీవ్ సమీపంలోని ఆస్పత్రిపై ఇరాన్ మిస్సైల్ దాడి చేసిన తర్వాత ఇజ్రాయిల్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఈ దాడికి ఖమేనీ బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.
Pakistan: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భేటీ అయ్యారు. వైట్ హౌజ్‌లో ట్రంప్, మునీర్‌కి లంచ్ ఆతిథ్యం ఇచ్చారు. ఇజ్రాయిల్-ఇరాన్ సంఘర్షణ సమయంలో ఈ భేటీ జరిగింది. ఇరాన్ గురించి పాకిస్తాన్‌కి అందరి కన్నా బాగా తెలుసు అని ట్రంప్ విలేకరులతో అన్నారు. ట్రంప్‌తో జరిగిన భేటీలో ఆసిమ్ మునీర్‌తో పాటు ఐఎస్ఐ చీఫ్ ఆసిమ్ మాలిక్ కూడా పాల్గొన్నారు.
Ayatollah Ruhollah Khomenei: మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయిల్-ఇరాన్ సంక్షోభం ప్రపంచదేశాలను భయపెడుతోంది. అమెరికా జోక్యం ఉండటంతో ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందా..? అనే అనుమానాలు నెలకున్నాయి. మరోవైపు, ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ట్రంప్, ఇజ్రాయిల్‌కి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాము ఎవరికీ లొంగేది లేదని, యుద్ధం మొదలైందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Karnataka: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహనిర్మాణ పథకాల్లో ముస్లింలకు 15 శాతం రిజర్వేషన్లను పెంచే ప్రతిపాదనను కర్ణాటక క్యాబినెట్ ఈ రోజు ఆమోదించింది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, గ్రామీణాభివృద్ధి శాఖలు అమలు చేసే అన్ని హౌసింగ్ పథకాల్లో ముస్లింలకు ప్రత్యేక కోటాను మంజూరు చేసింది. మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్లను ప్రస్తుత 10 శాతం నుండి 15 శాతానికి పెంచే ప్రతిపాదనకు గృహనిర్మాణ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ మద్దతు ఇచ్చారు.
Israel Iran War: ఇజ్రాయిల్ ఏడో రోజు కూడా ఇరాన్‌పై భీకర దాడిని కొనసాగించింది. గురువారం రాత్రిపూట ఇరాన్ లోని అరక్ అణు రియాక్టర్ని లక్ష్యంగా చేసుకుని, నటాజ్ ప్రాంతంలోని అణ్వాయుధ కేంద్రంపై దాడి చేసినట్లు ఇజ్రాయిల్ తెలిపింది. ఇరాన్ అణు కేంద్రాల్లో పాక్షికంగా నిర్మించిన ‘‘హెవీ వాటర్ రియాక్టర్’’ ఉంది. దీనిని మొదట అరక్ అని, ఇప్పుడు ఖోడాబ్ అని పిలుస్తున్నారు.
Amit Shah: భారతీయ భాషలు దేశ గుర్తింపుకు ఆత్మ వంటివని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం అన్నారు. భారతదేశ భాషా వారసత్వాన్ని తిరిగి పొంది, మాతృభాషల పట్ల గర్వంతో ప్రపంచానికి నాయకత్వం వహించాల్సిన సమయం వచ్చిందన్నారు. మాజీ సివిల్ సర్వెంట్ ఐఏఎస్ అశుతోష్ అగ్నిహోత్రి రచించిన 'మెయిన్ బూంద్ స్వయం, ఖుద్ సాగర్ హూన్' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
Thug Life: కమల్ హాసన్ కొత్త సినిమా ‘‘థగ్ లైఫ్’’ కర్ణాటకలో తప్పనిసరిగా విడుదల చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. విడుదలపై బెదిరింపులు రావడంపై కర్ణాటక సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా విడుదలకు వ్యతిరేకంగా బెదిరించే వారిపై చర్యలు తీసుకోవడం మీ కర్తవ్యం అని పేర్కొంది.
Donald Trump: ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయకుండా చూసుకోవడానికి ఇరాన్‌పై సైనిక దాడిలో అమెరికా ఇజ్రాయెల్‌తో చేరుతుందా లేదా అనే దాని గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. వైట్ హౌజ్‌లో విలేకరులు ప్రశ్నించగా దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ కావచ్చు, కాకపోవచ్చు. నేను ఏం చేయబోతున్నానో ఎవరికి తెలియదు’’ అని అన్నారు. గతవారంతో పోల్చితే ఇప్పటి పరిస్థితితో పెద్ద తేడా ఉందని మిడిల్ ఈస్ట్ సంక్షోభం గురించి అన్నారు.