Extramarital affair: “లవర్ సాయంతో భర్తను చంపిన మహిళ”.. కొడుకు సాక్ష్యంతో వెలుగులోకి నేరం..
- లవర్ సాయంతో భర్తను చంపిన మహిళ..
- 9 ఏళ్ల కొడుకు సాక్ష్యంతో దారుణం వెలుగులోకి..
- సంచలనంగా రాజస్థాన్ అల్వార్ మర్డర్ కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Extramarital affair: లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన కేసులో, తండ్రి మరణానికి 9 ఏళ్ల కొడుకు సాక్ష్యంగా మారాడు. జూన్ 07 రాత్రి రాజస్థాన్‌లోని అల్వార్ లోని ఖేర్లి ప్రాంతంలో జరిగిన ఈ హత్య బాలుడి ద్వారా వెలుగులోకి వచ్చింది. తన తండ్రిని తల్లి, తన ప్రియుడితో కలిసి ఎలా కాంట్రాక్ట్ కిల్లర్లతో కలిసి హత్య చేయించిందనే వివరాలను వెల్లడించాడు. మాన్ సింగ్ జాతవ్ అనే వ్యక్తి ఇంట్లో చనిపోయాడు. అయితే, ప్రారంభంలో అతడి భార్య అనిత ఆరోగ్య సమస్యలతో మరణించినట్లు చెప్పుకొచ్చింది. అయితే, వీరి కుమారుడు పోలీసులకు సంఘటన గురించి వివరించాడు. 48 గంటల్లోనే అసలు నిందితులు ఎవరనేది తెలిసింది.
బాలుడు చెబుతున్న దాని ప్రకారం, అతడి తల్లి ఆ రాత్రి ఉద్దేశపూర్వకంగానే ఇంటి ప్రధాన గేట్లను తెరించింది. అర్థరాత్రి సమయంలో నలుగురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు. ఈ నలుగురితో పాటు అనిత లవర్ కాశీరాం ప్రజాపత్ కూడా ఉన్నాడు. బాలుడు ఇతడిని ‘‘కాశీ అంకుల్’’ అని పిలుస్తాడు. వీరు మాన్ సింగ్ నిద్రలో ఉండగా, ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆ సమయంలో తాను ఈ హత్యను చూసినట్లు బాలుడు వెల్లడించాడు.
Also Read
- Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్‌కుమార్ మృతదేహం లభ్యం..
- Odisha Shocker: విషాద ఘటన.. భార్య మొబైల్‌తో తలపై కొట్టడంతో భర్త మృతి..
- Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
- Bangkok Pub Fire: అర్థరాత్రి పబ్‌లో మంటల బీభత్సం.. 27 మంది మృతి (వీడియో)
Read Also: Amzath Basha: ఏడాది పాలనలో అప్పు తప్ప.. పాలన, అభివృద్ధి లేదు!
“నేను ఇప్పుడే నిద్రలోకి జారుకున్నప్పుడు తలుపు దగ్గర చిన్న శబ్దం వినిపించింది. నేను కళ్ళు తెరిచి చూస్తే నా తల్లి గేటు తెరవడం చూశాను. కాశీ అంకుల్ బయట నిలబడి ఉన్నాడు. అతనితో పాటు మరో నలుగురు వ్యక్తులు ఉన్నారు. నేను భయపడ్డాను, నేను లేవలేదు, నేను నిశ్శబ్దంగా అంతా చూడటం ప్రారంభించాను. వారు మా గదికి వచ్చారు. నా తల్లి మంచం ముందు నిలబడి ఉండటం చూశాను. ఆ వ్యక్తులు అతనిని కొట్టారు, అతని కాళ్ళను పట్టుకుని, గొంతు నులిమారు. కాశీ అంకుల్ నాన్న నోటిని దిండుతో అదిమాడు. నేను నా తండ్రి కోసం చేయి చాపినప్పుడు కాశీ అంకుల్ నన్ను తన ఒడిలో ఎత్తుకుని తిట్టి బెదిరించాడు,” అని బాలుడు చెప్పాడు. భయంతో నేను మౌనంగా ఉన్నానని, కొన్ని నిమిషాల తర్వాత నాన్న చనిపోయారని, ఆ తర్వాత అక్కడ నుంచి అందరూ వెళ్లిపోయినట్లు చెప్పాడు.
పోలీసులు దర్యాప్తులో అనిత, కాశీరాం మధ్య వివాహేతర సంబంధం ఉందని, దీంతో హత్యకు ప్లాన్ చేసినట్లు తేలింది. ఖేర్లిలో అనిత ఒక చిన్న జనరల్ స్టోర్ నడుపుతోంది, ఇదే సమయంలో స్థానికంగా కచోరీలు అమ్మే కాశీరాం అనే వీధి వ్యాపారితో పరిచయమైంది. కాలక్రమంలో ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. అనిత, కాశీరామ్ కలిసి నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్స్‌కి రూ. 2 లక్షలు హత్య కోసం ఆఫర్ చేశారు.
ముందుగా, బంధువులకు మాన్ సింగ్ అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించి మరణించినట్లు చెప్పింది. అయితే, అతడి ఒంటిపై గాయాలు, విరిగిన పళ్లు వంటి గుర్తులు కనిపించడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. వైద్య పరీక్షల్లో హత్యకు గురైనట్లు తేలింది. ఈ కేసులో అనిత , కాశీరామ్, కాంట్రాక్ట్ కిల్లర్స్‌లో ఒకరైన బ్రిజేష్ జాతవ్ అను అరెస్ట్ చేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Shabad Murder Case : చనిపోవడానికి ముందు రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియో.. విస్తుపోయే నిజాలు..!
-
Trump: ఇకపై హార్ముజ్‌ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
-
Asian U23 Athletics: స్వర్ణ పతకంతో మెరిసిన తెలంగాణ బిడ్డ.. సీఎం రేవంత్ అభినందనలు..
-
Yemen Airport Attack: యెమెన్‌లో ల్యాండ్ అవుతుండగా క్షిపణుల వర్షం.. ఇరాన్ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో!
-
RBI Report: తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ.. ఆర్బీఐ నివేదిక
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!