Shubhanshu Shukla: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోకి అడుగుపెట్టి శుభాన్షు శుక్లా చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా ఆయన ఘటన సాధించారు. ఆక్సియం-4 ఐఎస్ఎస్తో డాక్ అయింది.
Karnataka: చేయని హత్యకు 2 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి, ఇప్పుడు తనను ఈ కేసులో ఇరికించిన పోలీసు అధికారులపై చర్యలకు సిద్ధమయ్యాడు. తన భార్యను హత్య చేశాడనే ఆరోపణలపై దాదాపు రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడిన ఒక గిరిజన వ్యక్తి, తనను తప్పుడు కేసులో ఇరికించిన అధికారులపై రూ.5 కోట్ల పరిహారం, క్రిమినల్ చర్యల్ని కోరుతూ కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించాడు.
BJP MLA: మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే బాబన్‌రావ్ లోనికర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. రాష్ట్రంలోని జల్నా జిల్లాలోని తన అసెంబ్లీ నియోజకవర్గం పర్తూర్‌లో జరిగిన ‘‘హర్ ఘర్ సోలార్’’ పథకంపై ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను హైలైట్ చేస్తూ , బీజేపీని విమర్శించే వారిని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశారు. ‘‘తన పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించే వ్యక్తులు మా వల్లే బట్టలు, బూట్లు, మొబైల్స్, పథకాలకు సంబంధించి డబ్బు, విత్తనాల కోసం డబ్బు పొందుతున్నారు అని తెలుసుకోవాలి’’…
SCO Summit: భారతదేశం ఉగ్రవాదంపై తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సమావేశంలో ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయడానికి భారత్ నిరాకరించింది. 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడి గురించి ప్రస్తావించకపోవడాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తప్పుపట్టారు.
Air India crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా దుర్ఘటనపై వేగంగా దర్యాప్తు సాగుతోంది. జూన్ 12న 275 మంది మరణానికి కారణమైన ఈ ప్రమాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విమాన ప్రమాదానికి కారణాలు వెల్లడించే విషయంలో కీలకంగా మారిన బ్లాక్ బాక్స్ లోని డేటాను డౌన్లోడ్ చేశారు.
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో కులులో బుధవారం మూడు ‘‘క్లౌడ్ బరస్ట్’’ చోటు చేసుకున్నాయి. దీంతో ఒక్కసారిగా మెరుపు వరదలు ఆ ప్రాంతాలను ముంచెత్తాయి. కీలక రహదారులు ఎక్కడికక్కడ స్తంభించి పోయాయి. సైన్జ్, గడ్సా, సోలాంగ్ నాలాలో కుండపోత వర్షాలు నమోదయ్యాయి. దీంతో జీవ నాలా ప్రవాహం అకస్మాత్తుగా పెరిగింది. స్థానిక ప్రజల్ని అధికారులు హెచ్చరించారు. ఆకస్మిక వరద కారణంగా నదులు మరియు వాగులు ఉప్పొంగి ప్రవహించాయి.
Honeymoon Murder Case: ఇటీవల మేఘాలయలో హత్యకు గురైన రాజా రఘువంశీ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. హనీమూన్ నెపంతో రాజాను మేఘాలయకు తీసుకెళ్లిన భార్య సోనమ్ దారుణంగా హత్య చేయించింది. తన లవర్ రాజ్ కుష్వాహాతో కలిసి సోనమ్ ఈ దారుణానికి ప్లాన్ చేసింది.
West Bengal: పశ్చిమ బెంగాల్లో గత 20 ఏళ్లుగా ప్రభుత్వం నిర్వహణలోని ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న ఆచారానికి స్వస్తి పలికారు. రెండు దశాబ్దాల తర్వాత హిందూ, ముస్లిం విద్యార్థులు తొలిసారిగా కలిసి బుధవారం మధ్యాహ్న భోజనం చేశారు. వివిధ మతాల విద్యార్థులకు వేర్వేరు భోజనం వడ్డిస్తున్న ఏళ్ల తరబడి ఆచారంపై విమర్శలు రావడంతో ఈ విధానాన్ని రద్దు చేసింది.
US Strike: అమెరికా ఇరాన్‌పై దాడులు నిర్వహించిన కొన్ని రోజులు తర్వాత, తమ అణు సౌకర్యాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఇరాన్ ధ్రువీకరించింది. ఇరాన్‌లోని అత్యంత కీలకమైన, అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఫోర్డో న్యూక్లియర్ ఫెసిలిటీ దెబ్బతిన్నట్లు శాటిలైట్ ఇమేజ్‌లు చూపిస్తున్నాయి. ఈ వారాంతంలో అమెరికా దాడుల్లో తమ దేశ అణు సౌకర్యాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘై బుధవారం అన్నారు.
Donald Trump: ఇజ్రాయిల్-ఇరాన్ సంఘర్షణపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నెదర్లాండ్స్‌లో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇజ్రాయిల్, ఇరాన్‌లు ‘‘పాఠశాలల్లోని ఇద్దరు పిల్లలు’’ అని అభివర్ణించారు. ఇటీవల, కాల్పుల విరమణ తర్వాత కూడా ఇరు దేశాలు మిస్సైల్ దాడులు జరుపుకోవడంపై డొనాల్డ్ ట్రంప్ లైవ్ టీవీలో ‘‘ఎఫ్-వర్డ్’’ వాడటం ఆన్లైన్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.