Soldier Killed In Militant Attack Near Bangladesh Border: భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉగ్రదాడి జరిగింది. త్రిపురలోని భారత్- బంగ్లా సరిహద్దులో ఈ మిలిటెంట్లకు, బీఎస్ఎఫ్ జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో బీఎస్ఎఫ్ జవాన్ మరణించారు. ఉత్తర త్రిపురలోని కంచన్ పూర్ సబ్ డివిజన్ పరిధిలోని అనందబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని మారుమూల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం త్రిపుర-మిజోరాం- బంగ్లాదేశ్ ట్రైజంక్షన్ సమీపంలో ఎన్ఎల్ఎఫ్టీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
145 బీఎస్ఎఫ్ బెటారియన్ పెట్రోలింగ్ బృందంపై ఈ దాడి జరిగింది. ఉగ్రవాదులు విచక్షణారిహితంగా బీఎస్ఎఫ్ బలగాలపై కాల్పులు జరిపారు. తేరుకుని బీఎస్ఎఫ్ దళాలు ఎదురుకాల్పులకు దిగే లోపే.. ఉగ్రవాదులంతా అడవిల్లోకి పారిపోయారని.. బీఎస్ఎఫ్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూంబింగ్ జరుగుతోంది. తీవ్రగాయాల పాలైన గిర్జేష్ కే ఆర్ ఉద్దేని హెలికాప్టర్ లో అగర్తలాకు తరలించారు. అక్కడ ఆయన మరణించినట్లు తెలుస్తోంది. సరిహద్దుకు అవతలి వైపు నుంచి వచ్చిన ఉగ్రవాదులు సైనికుడిపై కాల్పులు జరిపారు. గతేడాది త్రిపురలోని భారత్-బంగ్లా సరిహద్దుల్లో కూడా ఇలాంటి దాడే జరిగింది. ఎన్ఎల్ఎఫ్టీ ఉగ్రవాదులు పెట్రోలింగ్ చేస్తున్న ఇద్దరు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సిబ్బంది మరణించారు.
Read Also: Trisha: రాజకీయాల్లోకి త్రిష.. ఏ పార్టీలో చేరుతుందో తెలుసా?
అయితే ఉగ్రవాదులు బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి ప్రవేశించేందుకు ఈ దాడి చేసినట్లు కనిపించడం లేదని.. భద్రతా సిబ్బందిపై దాడి చేయాలనే లక్ష్యంతోనే కాల్పులకు పాల్పడ్డారని అధికారులు భావిస్తున్నారు. సమారు 7-8 మంది తిరుగుబాటుదారులు కాల్పలకు పాల్పడ్డారు. నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఎన్ఎల్ఎఫ్టీ) తరుచుగా భారత్ – బంగ్లాదేశ్ సరిహద్దుల్లో దాడులకు పాల్పడుతోంది.