Declare lumpy skin disease in cows as pandemic.. Rajasthan CM Gehlot to Centre: రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో లంపీ స్కిన్ డిసీజ్ వల్ల వేలల్లో పశువులు మరణిస్తున్నాయి. రాజస్థాన్ లో ఈ వ్యాధి అల్లకల్లోలం సృష్టిస్తోంది. రాజస్థాన్ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 29 జిల్లాలు ఈ వ్యాధి బారినపడ్డాయి. ఇదిలా ఉంటే ఈ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సుమారు ఏడు నుంచి 8 రాష్ట్రాలు లంపీ స్కీన్ వ్యాధితో ప్రభావితం అయ్యాయని.. ఆవులు ఈ వ్యాధికి గురయ్యే విధానం చాలా బాధాకరమైనదని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాధికి టీకా అందుబాటులో లేదు. దేశంలో ఇప్పుడిప్పుడే ఈ వ్యాధికి టీకా గురించి ప్రయోగాలు జరుగుతున్నాయి. త్వరలోనే వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Read Also: Soldier Killed: ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉగ్రదాడి.. జవాన్ వీరమరణం
రాష్ట్రంలో పరిస్థితి అధ్వాన్నంగా ఉందని.. వ్యాధి వ్యాప్తిని చూస్తే కోవిడ్ లాగా అనిపిస్తోందని.. లంపీ స్కిన్ పశువులపై ప్రభావం చూపిస్తోందని.. దీన్ని మహమ్మారిగా ప్రకటిస్తే రాష్ట్రానికి విపత్తు నిధులు వస్తాయని.. తద్వార సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుందని.. ఈ వ్యాధి ప్రమాదకరమైందని.. వేగంగా వ్యాప్తి చెందుతుందని.. గుజరాత్ లో కూడా పరిస్థితి ఇలానే ఉందని సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు.
రాజస్థాన్ రాష్ట్రంలో ఇప్పటి వరకు లంపీ స్కీన్ వ్యాధి బారిన పడి 22,000 పశువులు మరణించాయి. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే 29 జిల్లాల్లో దీని ప్రభావం ఉంది. జోధ్‌పూర్, బార్మర్, జైసల్మేర్, జలోర్, పాలి, సిరోహి, బికనేర్, చురు, గంగానగర్, హనుమాన్‌ఘర్, అజ్మీర్, నాగౌర్, భిల్వారా, టోంక్, జైపూర్, సికర్, జుంజును, అల్వార్, దౌసా, చిత్తోర్‌గఢ్, భరత్‌పూర్, ధోల్‌పూర్, కరౌలి, బన్స్వారా, ప్రతాప్‌గఢ్, దుంగార్‌పూర్, ఉదయపూర్‌లో అన్ని కేసులు నమోదయ్యాయి.