Bihar Gang Ran Fake Police Station For Eight Months: సాధారణంగా ఫేక్ పోలీసులమని నమ్మించి దోచుకోవడం, మోసాలు చేయడం చూస్తుంటాం. కానీ ఇది మాత్రం నెక్ట్ లెవల్ ఘరానా మోసం. ఏకంగా ఓ నకిలీ పోలీస్ స్టేషన్ తెరిచి దందాలు చేయడం ప్రారంభించారు కేటుగాళ్లు. ఏకంగా ఎనిమిది నెలల నుంచి పోలీస్ స్టేషన్ నడిపింది బీహార్ ముఠా. అయినా కూడా పోలీసులు కనిపెట్ట లేకపోయారు. అది కూడా ఓ అసలైన పోలీస్ అధికారి ఇంటికి కేవలం 500 మీటర్ల దూరంలో ఫేక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన గుర్తించలేకపోవడం పోలీసుల వంతైంది. ఈ ఫేక్ పోలీస్ స్టేషన్ పాట్నాలో జరిగింది.
ఫేక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన కేటుగాళ్లు.. అచ్చంగా పోలీస్ స్టేషన్ విధంగానే ఓ హోటల్ ను తీర్చిదిద్దారు. ర్యాంక్ బ్యాడ్జీలు ఉన్న పోలీస్ యూనిఫాంతో పాటు తుపాకీలతో పోలీస్ స్టేషన్ కలరింగ్ ఇచ్చేవారు. ఫిర్యాదులు, కేసులు నమోదు చేయడానికి నకిలీ పోలీస్ స్టేషన్ కు వచ్చే వారి నుంచి డబ్బులు వసూలు చేయడంతో పాటు వారికి సామాజిక గృహాలు, పోలీస్ ఉద్యోగాలు కల్పిస్తామని కబుర్లు చెప్పి అందినకాడికి నొచ్చేస్తుండేవారు. పోలీస్ స్టేషన్ లో పోలీస్ అధికారులుగా నటించేందుకు ఎక్కువ మందిని గ్రామీణ ప్రాంతాల నుంచి తీసుకువచ్చేవారు. వీరికి రోజూ రూ.500 ఇచ్చేవారు.
Read Also: Assam: అత్యాచార నిందితుడిని కొట్టి చంపిన గ్రామస్తులు
దాదాపు ఎనిమిది నెలలుగా ఫేక్ పోలీస్ స్టేషన్ నడుపుతున్నా అది నకిలీదని తెలుసుకోలేదు. అయితే ఓ చిన్న మిస్టేక్ వీరందరిని పట్టించింది. ఈ ఫేక్ పోలీసుల ముఠాలోని ఇద్దరు సభ్యులు సర్వీస్ ఇష్యూ ఆయుధాలకు బదులుగా స్థానిక వర్క్ షాపులోని తయారు చేసిన తుపాకులను తీసుకెళ్తుండటం ఓ నిజమైన పోలీస్ అధికారి గుర్తించడంతో గుట్టురట్టైంది. ఇద్దరు మహిళతతో పాటు ముఠాలోని ఆరుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు కీలక నాయకుడు మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీస్ అధికారి శ్రీవాస్తవ తెలిపారు. కేసులో దర్యాప్తు జరుగుతుందని.. మరింత వివరాలు దర్యాప్తులో తేలుతాయని ఆయన అన్నారు.