Tribute to Telugu IFS officer who was killed by Veerappan: కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే ఓ మారుమూల కుగ్రామం గోపీనాథం. అయితే 90ల దశకంలో ఈ పేరు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కార్యకలాపాలతో ఈ ఊరి పేరు వార్తల్లో నిలిచింది. కర్ణాటక రాష్ట్రం చామరాజనగరం జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది గోపీనాథం. ఈ ఊరితో తెలుగు రాష్ట్రాలకు కూడా అనుబంధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి పి. శ్రీనివాస్ ను వీరప్పన్ ఘోరంగా చంపింది ఈ ప్రాంతంలోనే.
అయితే ఇప్పటికే ఓ మంచి ఐఎఫ్ఎస్ అధికారిగా కొల్లేగల్, చామరాజనగర్ అటవీ ప్రాంతాల గ్రామాల ప్రజల అభిమానాన్ని పొందారు శ్రీనివాస్. అయితే ఆయన 1990లో విధుల్లో ఉండగా.. గోపీనాథం అనే గ్రామంలో గుడిని నిర్మించడానికి సహాయం చేశారు. ప్రస్తుతం ఆ గుడి సమీపంలో ఆ అధికారి విగ్రహం ఉంటుంది. ఆలయంలో మొదటి హారతి సమయంలో.. శ్రీనివాస్ విగ్రహాన్ని గౌరవిస్తారు అక్కడి ప్రజలు. ఆయన చిత్రపటానికి పూజలు కూడా నిర్వహిస్తుంటారు. మాకు మారమ్మ, శ్రీనివాసులు ఒకరే అని అక్కడి ప్రజలు ఎంతో భక్తితో చెబుతుంటారు. ఆయన పుట్టిన రోజు సెప్టెంబర్ 12న శ్రీనివాస్ ప్రతిమను ఏర్పాటు చేస్తున్నామని.. ఈ కార్యక్రమాన్ని పండగల, ఘనంగా జరుపుకుంటామని ఆలయ కమిటీ అధ్యక్షుడు మహాలింగప్ప అన్నారు. ఇప్పటికే చామనగర జిల్లా వ్యాప్తంగా శ్రీనివాస్ పనిచేసిన చోట ఆయనకు సంబంధించిన జీపు, పత్రాలు, డాక్యుమెంట్లను గౌరవంగా భావిస్తుంటారు ఇప్పటి అధికారులు. ఆ ప్రాంతంలో పనిచేసే ప్రతీ ఫారెస్ట్ అధికారికి రోల్ మోడల్ గా ఉన్నారు పీ. శ్రీనివాస్.
Read Also: CM KCR Bihar Tour: నేడు బీహార్ సీఎం కేసీఆర్.. బీహార్ సీఎంతో భేటీ
ఆంధ్రప్రదేశ్ రాజమండ్రికి చెందిన తెలుగు వ్యక్తి పి. శ్రీనివాస్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (డీసీఎఫ్)గా కర్ణాటక రాష్ట్రంలో విధులు నిర్వహిస్తుండే వారు. 1979లో ఐఎఫ్‌ఎస్‌లో చేరాడు. వీరప్పన్ భయంతో చామరాజనగర్ జిల్లాలో ఏ ఫారెస్ట్ ఆఫీసర్ లేదా పోలీసు అధికారి కూడా పనిచేయడానికి ఇష్టపడని సమయంలో శ్రీనివాస్. 1990-91లో అక్కడ నియమితులయ్యారు. అయితే గ్రామస్తుల సహాయం లేకుండా వీరప్పన్ ను పట్టుకోవడం సాధ్యం కాదని భావించిన శ్రీనివాస్ అక్కడి గ్రామస్తులకు చేరువయ్యారు.
అయితే ఇదే సమయంలో వీరప్పన్ ఓ కుట్రకు తెరతీశాడు. తాను లొంగిపోతానని శ్రీనివాస్ కు వర్తమానం పంపాడు. ఇది నమ్మిన శ్రీనివాస్ నవంబర్ 10,1991లో మరో ఐదుగురు గ్రామస్తులతో కలిసి ఎరకేయం అటవీలోకి వెళ్లారు. కాగా వీరప్పన్ శ్రీనివాస్ ను అత్యంత క్రూరంగా తలనరికి.. తలను మొండాన్ని వేరు చేసి ఓ వెదురు బల్లెనికి తలను ఉంచాడు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వీరప్పన్ గురించి ప్రపంచానికి తెలిసింది.