National Crime Records Bureau (NCRB) report On Woman Molestation: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దేశంలో వివిధ నేరాలపై నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కేసుల వివరాలు, క్రైమ్ రేట్ మొదలైన వివరాలను నివేదిక బహిర్గతపరిచింది. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం దేశంలో అత్యధికంగా అత్యాచారా కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రాలే ఉన్నాయి. ఏడాది కాలంలో అత్యధికంగా రాజస్థాన్ రాష్ట్రంలో అత్యాచార కేసులు నమోదు అయ్యాయి. రాజస్థాన్ తరువాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్రలు ఉన్నాయి.
2021లో రాజస్థాన్ లో మొత్తం 6,337 అత్యాచార కేసులు నమోదు అయ్యాయి. ఇది 2020తో నమోదైన 5,310 కేసుల కన్నా 19.34 శాతం ఎక్కువగా. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2,947 అత్యాచార కేసులు నమోదు అయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్ లో 2,845, మహారాష్ట్రలో 2,496 అత్యాచార కేసులు నమోదు అయ్యాయి. అయితే అన్ని రాష్ట్రాలతో పోలిస్తే రాజస్థాన్ లో కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. గతేడాది పలు కీలకమైన అత్యాచార కేసులు రాజస్థాన్ లోనే బయటపడ్డాయి. 2021లో రాజస్థాన్ లో 1,452 అత్యాచారాలు కేసులు మైనర్లకు సంబంధించినవి కాగా.. 60 ఏళ్లకు పైబడిన వారిపై అత్యాచారం చేసిన ఘటనలు నాలుగు ఉన్నాయి. అత్యాచారం కేసుల్లో సగానికి పైగా తెలిసిన వారు, అదే కుటుంబానికి చెందిన వారు, పొరుగువారే నుంచే జరిగాయి. మహిళలకు, పిల్లలకు బాగా తెలిసిన వ్యక్తులే అత్యాచారాలకు పాల్పడినట్లు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది.
Read Also: Revanth Reddy: మోదీ తెలంగాణను, కేసీఆర్ దేశాన్ని ఆక్రమించేందుకు బయల్దేరారు
రాజస్థాన్ లో షెడ్యూల్ కులాలు, తెగల్లో అత్యాచార కసులు పెరిగాయని నివేదిక వెల్లడించింది. ఇక ఉత్తర్ ప్రదేశ్ మహిళలపై నేరాల విషయంలో రెండో స్థానంలో ఉంది. గతంలో మహిళపై లైంగిక పరమైన నేరాల్లో ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చే వారు కాదు..అయితే ఇటీవల తమకు జరిగిన అన్యాయంపై మహిళలు కేసులు నమోదు చేస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రెహానా రియాజ్ మాట్లాడుతూ.. మహిళలపై నేరాలు పెరగడం ఆందోళనకరం అని.. అయితే దర్యాప్తులో చాలా కేసులు నకిలీవి అని తేలిందని ఆమె అన్నారు.