Venu Goapl Reddy
Author- NTV Telugu-
Kerala: భార్య ఉద్యోగం మానేయడం లేదని దారుణంగా కొట్టిన భర్త
Kerala Man Arrested For Thrashing Wife Who Refused To Quit Her Job: ప్రస్తుతం ఉన్న కాలంలో చాలా మంది ఉద్యోగం చేసే అమ్మాయి భార్యగా రావాలని కోరుకుంటున్నారు. తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఆలోచనలో భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కేరళకు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన భార్య ఉద్యోగం మానేయడం లేదని తీవ్రంగా దాడి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
Bengaluru: బెంగళూర్ లో భారీ వర్షం.. నీటిలో మునిగిన రోడ్లు, కార్లు.
Heavy Rain in Bengaluru, Many Roads Flooded, Cars Damaged: బెంగళూర్ నగరం వరసగా కురుస్తున్న వర్షాలతో అతలాకుతలం అవుతోంది. గత నెల కురిసిన వర్షాల కారణంగా చాలా ఏరియాలు నీటిలో మునిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే బుధవారం బెంగళూర్ నగరంలో భారీ వర్షం కురిసింది. బెల్లందూర్ బెల్లందూరు ఐటీ జోన్‌తో సహా నగరంలోని తూర్పు, దక్షిణ, మధ్య ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. రాజమహల్ గుట్టహళ్లిలో 59 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో మూడు… -
United Nations: భారత్ ప్రతిపాదనను నిలిపేసిన చైనా.. పాకిస్తాన్ ఉగ్రవాదికి మద్దతు
China Puts On Hold India, US' Move At UN To Blacklist Hafiz Saeed's Son: లష్కరే తోయిబా చీఫ్, 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీస్ సయీద్ కుమారుడు పాకిస్తాన్ ఉగ్రవాది హఫీజ్ తలా సయీద్ ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలని ఐక్యరాజ్యసమితిలో భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనను చైనా బుధవారం నిలుపుదల చేసింది. రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతుగా నిలిచింది చైనా. ఈ ఏడాది ఏప్రిల్ లో భారత ప్రభుత్వం హఫీస్ తలా సయీద్… -
Congress President Election: కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే.. శశిథరూర్‌పై భారీ విజయం
Mallikarjun Kharge wins the Congress presidential elections:కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అంతా అనుకున్న ప్రకారం మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు. శశిథరూర్ పై భారీ మెజారిటీతో విజయం సాధించారు. రెండు దశాబ్ధాల తరువాత తొలిసారిగా గాంధీయేతర వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. ఖర్గేకు 7897 ఓట్లు రాగా.. శశి థరూర్ కు కేవలం 1072 ఓట్లు మాత్రమే వచ్చాయి. 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగడం ఇది ఆరోసారి. పార్టీకి 98వ అధ్యక్షుడిగా… -
Emmanuel Macron: ఇండియాకు ఫ్రాన్స్ అధ్యక్షుడు.. ఎజెండా ఇదే..
Emmanuel Macron To Visit India Early Next Year: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుమేల్ మక్రాన్ భారత పర్యటనకు రాబోతున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఆయన భారతదేశాన్ని సందర్శించేందుకు రానున్నారు. ఫ్రెంచ్ మంత్రి క్రిసౌలా జచరోపౌలౌ, భారత సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. మాక్రాన్ 2023 ప్రారంభంలో భారతదేశాన్ని సందర్శించాల్సి ఉందని అన్నారు. మహారాష్ట్రలోని జైతాపూర్ అణువిద్యుత్ రియాక్టర్ల నిర్మాణానికి సంబంధించి పునరుద్ధరణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇండియాకు రానున్నట్లు తెలుస్తోంది. -
Partial Solar Eclipse: ఈ నెల 25న పాక్షిక సూర్యగ్రహణం.. ఇప్పుడు తప్పితే మళ్లీ పదేళ్ల తరువాతే
Partial Solar Eclipse: అక్టోబర్ 25న పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతోంది. యూరప్, పశ్చిమ ఆసియా, ఈశాన్య ఆఫ్రికాల్లో ఈ ఖగోళ అద్భుతం కనువిందు చేయబోతోంది. సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు రావడంతో గ్రహణం ఏర్పడుతుంది. 25 మధ్యాహ్నం ఇండియాలో సూర్యగ్రహణం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చు. భారతదేశంలో తూర్పు ప్రాంత నగరమైన కోల్‌కతా ప్రజలు తక్కువ సమయం పాటు ఈ సూర్యగ్రహణాన్ని చూడవచ్చు. అయితే ఉత్తర, పశ్చిమ భారతదేశ ప్రాంతాలు […] -
Shashi Tharoor: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు
Shashi Tharoor comments on congress president elections: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ ఇద్దరూ కూడా తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే మొదటి నుంచి శశిథరూర్ అధ్యక్ష ఎన్నికల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరోసారి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ఫ్రీ-ఫెయిర్ గా జరగలేదని ఆయన అన్నారు. ఎన్నికలు నిష్ఫక్షపాతంగా జరగలేదని వ్యాఖ్యానించారు. దాదాపుగా […] -
Delhi: మహిళ కిడ్నాప్, సామూహిక అత్యాచారం.. నిర్భయ తరహాలో చిత్రహింస
Physical assault on woman in Delhi:ఢిల్లీలో మృగాళ్లు దారుణానికి తెగబడ్డారు. ఢిల్లీకి చెందిన 40 ఏళ్ల మహిళపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మరోసారి ఢిల్లీ నిర్భయ ఘటనను గుర్తు చేసే విధంగా ప్రవర్తించారు. మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు వ్యక్తులు. తీవ్ర గాయాలపాలైన సదరు బాధిత మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉంది. ప్రస్తుతం ఆస్పత్రిలో బాధితురాలికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషనర్ సీరియస్ అయ్యారు. అధికారుల […] -
EAM S. Jaishankar: ముంబై దాడులతో పుల్వామా, ఉరీ దాడులను పోల్చి చూడండి..
EAM S. Jaishankar Comments on india's foreign policies:భారత విదేశాంగ విధానం గురించి విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ మంగళవారం అహ్మదాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. నేను ఏం చేస్తున్నానో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. విదేశాంగ శాఖ మంత్రిగా యూఎస్, ఆస్ట్రేలియా మొదలైన దేశాలకు ప్రయాణిస్తున్నానని మీరు చదివి ఉంటారు..కానీ నేను ఏం చేస్తానో, ఓ విదేశాంగ మంత్రి ఏం చేస్తాడో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. -
VK Sasikala: జయలలిత మరణంలో నా పాత్ర లేదు.. విచారణ ఎదుర్కోవడానికి సిద్ధం
VK Sasikala reacts to Arumughaswamy commission’s report: తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత మరణంపై అరుముగస్వామి కమిషన్ ఆ రాష్ట్రంలో హీట్ పెంచుతోంది. కమిషన్ ఇచ్చిన రిపోర్టు రాజకీయంగా చర్చనీయాంశం అయింది. అయితే కమిషన్ జయలలిత స్నేహితురాలు వీకే శశికళతో పాటు మరో ముగ్గురిపై అనుమానాలు ఉన్నాయనే రిపోర్టును ఆమె వ్యతిరేకించారు. జయలలిత చికిత్సలో తానెప్పుడు కలుగచేసుకోలేదని, ఆమె మరణంలో నా పాత్ర లేదని అన్నారు. తమిళనాడు అసెంబ్లీలో మంగళవారం అరుముగస్వామి రిపోర్టును ప్రవేశపెట్టారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!