Russian businessman died after falling from a hospital window: ఉక్రెయిన్‌పై రష్యా దాడిని వ్యతిరేకించిన రష్యన్ వ్యాపారవేత్త అనుమానాస్పద స్థితిలో మరణించారు. దేశంలో అతిపెద్ద చమురు కంపెనీ లుకోయిల్ చైర్మన్ రావిల్ మగనోవ్(67) ఆస్పత్రి కిటీకి నుంచి పడి గురువారం చనిపోయారు. ఇదే ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన మరణం మిస్టరీగా మారింది. దీనిపై రష్యా ఏజెన్సీలు విచారణ జరుపుతున్నాయి. మగనోవ్ సెంట్రల్ క్లినికల్ ఆస్పత్రి ఆరో అంతస్తు నుంచి పడి చనిపోయారు.
రష్యా, ఉక్రెయిన్‌పై చేస్తున్న దాడిని మగనోవ్ వ్యతిరేకించారు. అయితే ఇటీవల డిప్రెషన్ కు గురైన మగనోవ్ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల మరణించిన సోవియట్ యూనియన్ చివరి అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచేవ్ కూడా ఇదే అస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రస్తుతం మగనోవ్ మరణాన్ని ఆయన కంపెనీ లకోయిల్ ధ్రువీకరించింది. తీవ్రమైన అనారోగ్యంతో ఆయన మరణించాడని ప్రకటించింది. అయితే ఆయన మరణం వెనక ఉన్న కారణాలను తెలుసుకునేందుకు విచారణ ప్రారంభం అయింది.
Read Also: Nirvair Singh: ఘోర రోడ్డు ప్రమాదం.. స్టార్ సింగర్ దుర్మరణం
ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్‌పై దాడిని ప్రారంభించింది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపాలని పిలుపునిచ్చిన కంపెనీల్లో లుకోయిల్ ఒకటి. రష్యా యుద్ధం వల్ల ప్రభావితం అయిన వారికి లుకోయిల్ కంపెనీ బోర్డు సానుభూతిని తెలియజేసింది. తక్షణమే యుద్ధాన్ని ముగించాలని కోరింది. దీనిపై అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిథి డిమిత్రి పెస్కోవ్ గురువారం మాట్లాడుతూ.. ఇది క్రెమ్లిన్ కు సంబంధించిన విషయం కానది అన్నారు. 1954లో జన్మించిన మగనోవ్.. 1993 నుంచి లుకోయిల్ లో పనిచేస్తూ.. 2020లో ఆ కంపెనీకి చైర్మన్ అయ్యారు. గతంలో అసాధారణ పరిస్థితుల్లో నోవాటెల్ మాజీ మేనేపజర్ సెర్గీ ప్రోటోసెన్యా, గాజ్ ప్రోమ్ బ్యాంక్ మాజీ వైస్ ప్రెసిడెంట్ వ్లాడిస్లావ్ అవయేవ్, మాజీ లుకోయిల్ టైకూన్ అలెగ్జాండర్ సుబోటిన్ మరణించారు.