MP Aravind comments on CM KCR: రైతులు, కార్మికులు, మహిళలు నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ అరవింద్. సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రశ్నించేందుకు ‘ ఇందూరు జనతా కో జవాబ్ దో’ అనే నినాదంతో ఈ నెల 3న బీజేపీ భారీ సభను ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హమీల అమలుపై సీఎం కేసీఆర్ కు అరవింద్ బహిరంగ లేఖ రాశారు. సీఎం పర్యటనకు సంబంధించి తనకు ఇంకా ఆహ్వానం అందలేదని ఆయన అన్నారు. సభలో తనకు మాట్లాడే అవకాశం కల్పించాలని అన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ పార్టీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు.
Read Also: Chiranjeevi: కొరటాలపై చిరుకు ఇంత కోపం ఉందా..?
దళిత, గిరిజనుల సంక్షేమాన్ని సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని అరవింద్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలను విస్మరించారని అన్నారు. కనీసం కేసులు కూడా ఎత్తివేయలేదని అన్నారు. బీహార్ వెళ్లిన సీఎం కేసీఆర్ తెలంగాణ పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి కేసీఆర్ని బీహార్ రానీవ్వకుండా చేసుకున్నారని అన్నారు. మూడు నెలల తర్వాత టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందని జోస్యం చెప్పారు.
మరో బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ బీహార్ పర్యటన ఒక డ్రామా అని ఎద్దేవా చేశారు. హిట్ పిక్చర్ చేద్దామని పోయి బొక్క బోర్లా పడ్డారని.. కాంగ్రెస్ తో ఉన్న నితీష్ కుమార్ ను కేసీఆర్ కలిశారని అన్నారు. తెలంగాన పరవును కేసీఆర్ తీశారని విమర్శించారు. తెలంగాణ సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. మోదీకి కేసీఆర్ సర్టిఫికేట్ అవరసరం లేదని పొంగులేటి అన్నారు. కాంగ్రెస్ చోడో.. భారత్ జోడో దేశంలో నడుస్తోందని ఆయన అన్నారు. కేసీఆర్ మహారాష్ట్ర పోయాడు అక్కడ పనైపోయింది.. జార్ఖండ్ పోయాడు ఆయన పని కూడా అవుతుందని.. బీహార్ పోయాడు అక్కడ ఏం అవుతోందో అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అంటే కిలాడీ చంద్రశేఖర్ రావు అని అన్నారు. కమ్యూనిస్టులు కమర్షియలిస్టులు అయ్యారని విమర్శించారు.