Mamata Banerjee praised RSS.. Criticized by the opposition: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)కు మద్దతుగా పశ్చిమ బెంగాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌లో అందరూ చెడ్డవారు కాదని.. బీజేపీకి మద్దతు ఇవ్వని వారు కూడా చాలా మంది ఉన్నారని త్రుణమూల్ అధినేత్రి అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్, వామపక్షాలు, ఎంఐఎం పార్టీలు దీదీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నాయి. అయితే ఆర్ఎస్ఎస్ ఈ వ్యాఖ్యలపై స్పందించలేదు.. బెంగాల్ లో జరిగిన రాజకీయ హింసాకాండను ఎత్తిచూపింది.. దిద్దుబాటు చర్యలను తీసుకోవాలని మమతా బెనర్జీని కోరింది ఆర్ఎస్ఎస్.
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ దీదీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. 2003లో ఇలాగే ఆమె ఆర్ఎస్ఎస్ ని దేశభక్తులగా పొగిడారని.. ఆర్ఎస్ఎస్ కూడా ఆమెను దుర్గా అని అన్నారని ఆయన గురువారం గుర్తు చేశారు… దీదీ వ్యాఖ్యలపై టీఎంసీ ముస్లిం నాయకులు ఆమె నిజాయితీని, స్థిరత్వాన్ని మెచ్చుకుంటారని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతిగా టీఎంసీ.. తన లౌకిక ఆధారాలను ఎవరి ముందు నిరూపించుకోవాల్సిన అవసరం లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఓవైసీకి మనం ఏం నిరూపించుకోవాల్సిన అవసరం లేదని.. ప్రతీ సంస్థలో మంచి, చెడు వ్యక్తులు ఉన్నారని చెప్పడానికి మమతా బెనర్జీ ప్రయత్నించారని టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ అన్నారు.
Read Also: CM Himanta Biswa Sarma: భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మదర్సాలను కూల్చేస్తాం..
కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి కూడా ఆమె వ్యాఖ్యలను తప్పుపట్టారు. మమతా బెనర్జీ ఇలా ప్రశంసించడం మొదటిసారి కాదని.. అటల్ బిహారీ వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో, ఎన్డీయేలో మమతాబెనర్జీ భాగంగా ఉన్నారని అన్నారు. మమతా బెనర్జీ లెఫ్ట్ ఫ్రంట్ ను పడగొట్టేందుకు అప్పట్లో బీజేపీ మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ మద్దతు కోరారని విమర్శించారు. కొన్ని సార్లు మమతా బెనర్జీ హిందూ మత ఛాందసవాదులు, మరికొన్ని సమయాల్లో ముస్లింల మద్దతు పొందేలా చేస్తున్నారని ఆరోపించారు. మమతా బెనర్జీ నిజస్వరూపం మరోసారి బట్టబయలైందని వ్యాఖ్యానించారు అధిర్ రంజన్ చౌదరి. బీజేపీపై పోరాటంలో టీఎంసీకి విశ్వసనీయ లేదని సీపీఐ ఆరోపించింది.
గతంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత జరిగిన రాజకీయ హింసలో 60 మంది మరణించారని..వీటిపై విచారణ చేయాలని ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిష్ణు బసు అన్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్, బీజేపీలకు మమతా బెనర్జీ సర్టిఫికేట్ అవసరం లేదని అన్నారు.