IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Afghanistan 3rd T20 Playing 11: భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి పోరుకు రంగం సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు రాత్రి 7:30 గంటలకు సోనీ స్పోర్ట్స్‌లో మూడో టీ20 ఆరంభం కానుంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా.. సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. దీంతో చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయాలని శ్రేయాస్ సేన చూస్తోంది. మరోవైపు అఫ్గానిస్థాన్ కనీసం చివరి మ్యాచ్‌లోనైనా విజయం సాధించి.. సిరీస్‌ను ముగించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
వైభవ్‌కు ఛాన్స్:
సిరీస్ ఇప్పటికే భారత్ సొంతం కావడంతో.. మూడో టీ20లో బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లకు అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. తుది జట్టులో మార్పులు చేసి.. స్క్వాడ్‌లోని ఇతర ఆటగాళ్లను పరీక్షించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఫామ్‌లో ఉండటం భారత్‌కు అదనపు బలం. రెండో టీ20 అనంతరం కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఈ మ్యాచ్‌లో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ దక్కనుంది. అయితే సంజు, అభిషేక్ల్లో ఎవరిని పక్కన పెడతారన్నది ఆసక్తికరం. సంజు ఫామ్ అందుకోవడంతో.. వరుసగా ఆడుతున్న అభిషేక్‌ను పక్కనపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Also Read
- IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
- PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
ఇంకొన్ని మార్పులు:
భారత తుది జట్టులో ఇంకొన్ని మార్పులు ఉండొచ్చు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చి.. యశ్ ఠాకూర్‌ను ఆడించే అవకాశాలున్నాయి. నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబెల్లో ఒకరిని పక్కన పెట్టి.. వాషింగ్టన్ సుందర్‌ను ఆడించే అవకాశాలు లేకపోలేదు. ఇక భారత్‌కు ఏమాత్రం పోటీని ఇవ్వలేకపోతున్న అఫ్గాన్ వైట్‌వాష్ తప్పించుకోవడానికి పోరాడుతుందేమో చూడాలి. రెండు మ్యాచ్‌ల్లోనూ డకౌటైన ఓపెనర్ గుర్బాజ్.. ఈ మ్యాచ్‌లో అయినా ఆడుతాడేమో చూడాలి. కెప్టెన్ ఇబ్రహీం జాద్రాన్, అజ్మతుల్లా ఓమర్జాయ్, మహ్మద్ నబి, రషీద్ ఖాన్ చెలరేగడం ఇప్పుడు అఫ్గాన్‌కు కీలకం.
హెడ్ టు హెడ్:
టీ20 ఫార్మాట్లో భారత్, అఫ్గానిస్థాన్ మధ్య ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు జరిగాయి. ఈ 10 మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే విజయం సాధించింది. అఫ్గానిస్థాన్ ఇప్పటివరకు భారత్‌పై టీ20 విజయం నమోదు చేయలేదు.
పిచ్, వాతావరణ పరిస్థితులు:
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉండనుంది. మ్యాచ్ సమయంలో 30 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రత ఉండొచ్చని అంచనా. వాతావరణం మేఘావృతంగా ఉండే అవకాశం ఉంది. ఈ పిచ్‌పై పేసర్లకు కూడా కొంత సహకారం లభించే అవకాశం ఉంది. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు సుమారు 165 పరుగులుగా ఉంది. చేజింగ్ చేసే జట్లకు కూడా ఈ మైదానంలో మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఉన్న గణాంకాల ప్రకారం.. లక్ష్యాన్ని ఛేదించే జట్ల విజయశాతం సుమారు 70 శాతంగా ఉంది. టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
ప్లేయింగ్ 11:
భారత్: సంజు శాంసన్, అభిషేక్ శర్మ/వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే/వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా/యశ్ ఠాకూర్.
అఫ్గానిస్థాన్: రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, సెదికుల్లా అటల్, గుల్బదిన్ నైబ్, దర్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్హక్ ఫరూఖీ.
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!