Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
- హైదరాబాద్ ఆరంఘర్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
- బైక్‌ను ఢీకొట్టిన మితిమీరిన వేగంతో వచ్చిన టిప్పర్ లారీ
- లారీ చక్రాల కింద నలిగి తండ్రి, కూతురు మృతి
- మృతులను ఇస్మాయిల్ ఖాన్, బురుషాన్ బేగంగా గుర్తింపు
- మరో వారం రోజుల్లో బురుషాన్ బేగం వివాహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: హైదరాబాద్‌లోని ఆరంఘర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన టిప్పర్ లారీ బైక్‌ను ఢీకొట్టడంతో తండ్రి, కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ చక్రాల కింద నలిగిపోవడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
స్థానికుల వివరాల ప్రకారం.. హయత్‌నగర్ నుంచి అత్తాపూర్ వైపు కంకర లోడుతో టిప్పర్ లారీ వెళ్తోంది. ఈ క్రమంలో ఆరంఘర్ చౌరస్తా వద్ద బైక్‌పై వెళ్తున్న తండ్రి, కూతురిని టిప్పర్ ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో ఇద్దరూ లారీ చక్రాల కింద చిక్కుకుని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Also Read
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
మృతులను అత్తాపూర్‌కు చెందిన ఇస్మాయిల్ ఖాన్, ఆయన కుమార్తె బురుషాన్ బేగంగా గుర్తించారు. మరో వారం రోజుల్లో బురుషాన్ బేగం వివాహం జరగాల్సి ఉండటంతో కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ సమయంలో తండ్రి, కూతురు ఇద్దరూ ప్రమాదంలో మృతి చెందడంతో పెళ్లి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఊహించని ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!