Venu Goapl Reddy
Author- NTV Telugu-
North Korea: ఏకంగా 10 క్షిపణుల ప్రయోగం.. సౌత్ కొరియా హై అలెర్ట్..
North Korea fired at least 10 missiles of various types on Wednesday: ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగాలను జరిపింది. బుధవారం రోజున ఏకంగా 10 క్షిపణులను ప్రయోగించింది. దీంతో దక్షిణ కొరియా అలెర్ట్ ప్రకటించింది. తమ ప్రజలు బంకర్లలోకి వెళ్లాలని సూచించింది. బాలిస్టిక్ క్షిపణి దక్షిణ కొరియా జాలాలకు దగ్గర్లో పడినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. దీన్ని కవ్వింపు చర్యగా దక్షిణ కొరియా అభివర్ణించింది. మరోవైపు రెండు దేశాల వివాదాస్పద […] -
Monkeypox: గ్లోబల్ ఎమర్జెన్సీగానే మంకీపాక్స్.. డబ్ల్యూహెచ్ఓ కీలక నిర్ణయం
Monkeypox still a global health emergency, says WHO: ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగానే కొనసాగించాలని డబ్ల్యూహెచ్ఓ నిర్ణయించింది. ఎమర్జెన్సీ కమిటీ మంకీపాక్స్ ను హెల్త్ ఎమర్జెన్సీగానే కొనసాగించాలని మంగళవారం నిర్ణయించింది. ఈ ఏడాది జూలైలో మంకీపాక్స్ ను గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించారు. ప్రస్తుతం దీన్ని మరికొంత కాలం కొనసాగించనున్నారు. మంకీపాక్స్ కట్టడికి ప్రపంచ దేశాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. అత్యవసర కమిటీ నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ అథనామ్ ఘెబ్రేయేసస్ స్వాగతించారు. -
Tamil Nadu: తమిళనాడుపై ఈశాన్య రుతుపవనాల పంజా.. వరద గుప్పిట చెన్నై నగరం
Tamil Nadu Witnesses Heavy Rain: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవితం అస్తవ్యస్తంగా తయారైంది. ముఖ్యంగా చెన్నై మహానగరం వరద గుప్పిట చిక్కుకుంది. చెన్నైతో పాటు పరిసర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. నగరంలోని చాలా ప్రాంతాలు వరద నీరు చేరింది. సిటీలోని నుంగంబాక్కంలో నిన్న ఒకే రోజు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. దీంతో పాటు సబర్బన్ రెడ్ హిల్స్ 13 సెంటీమీటర్లు, పెరంబూర్ లో 12 సెంటీమీటర్ల వర్షపాతం… -
Twitter: ట్విట్టర్ యూజర్లకు షాక్.. ఇకపై బ్లూ టిక్ ఉంటే ఇంత చెల్లించాల్సిందే..
Twitter blue tick at $8 per month, says Elon Musk: ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సంస్థలో పనిచేసే కీలక ఉద్యోగులను తొలగించారు. దీంతో పాటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ను రద్దు చేశారు. దీంతో ట్విట్టర్ కు కేవలం మస్క్ మాత్రమే ప్రస్తుతం డైరెక్టర్ గా ఉన్నారు. మరోవైపు మరింత మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధం అవుతున్నారు. 75 శాతం ఉద్యోగులను తొలగించే ప్లాన్ లో… -
China: “జిమ్మి సాంగ్”కు చైనాలో క్రేజ్.. బప్పిలహరి పాటతో ప్రజల నిరసన
Chinese people protest with Bappi Lahiri song: చైనా దేశంలో జీరో కోవిడ్ ప్రోటోకాల్ తో అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏకంగా జి జిన్ పింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ హిందీ పాట తెగ క్రేజ్ సంపాదించుకుంది. ఎప్పుడో 1982లో బప్పిలహరి స్వరపరిచిన ‘‘జిమ్మి..జమ్మి’’ సాంగ్ తెగ హల్చల్ చేస్తోంది. అక్కడి ప్రజలు ప్రభుత్వానికి నిరసన తెలిపే ఓ పాటగా దీన్ని ఎంచుకున్నారు. 82లో మిథున్ చక్రవర్తి నటించిన ‘ డిస్కో డాన్సర్’… -
Hardeep Singh Puri: రష్యా నుంచి ఆయిల్ కొంటాం.. పాశ్చాత్య మీడియాకు కేంద్రమంత్రి దిమ్మతిరిగే సమాధానం
Union minister snubs journalist on India's Russian oil purchase: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆయిల్ కొనుగోళ్లపై ఆంక్షలు విధించాయి. ఇదిలా ఉంటే యుద్ధం నేపథ్యంలో ఆయిల్ కొనుగోళ్లపై భారత్ కు రష్యా డిస్కౌంట్ ఇచ్చింది. దీంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా తక్కువ ధరకే రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది ఇండియా. ఇదిలా ఉంటే భారత్ ఈ చర్యపై యూరోపియన్ దేశాలు, అమెరికా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అక్కడి మీడియా భారత చర్యను తప్పుపడుతోంది.… -
Fire Accident: పూణే, ఢిల్లీల్లో అగ్నిప్రమాదాలు.. ఇద్దరు మృతి.. భారీగా ఆస్తినష్టం..
Fire breaks out in Delhi and Pune:దేశ రాజధాని ఢిల్లీతో పాటు పూణే నగరాల్లో మంగళవారం అగ్నిప్రమాదాలు సంభవించాయి. రెండు ప్రమాదాల్లో ప్రాణ నష్ణం సంభవించలేదు. పెద్ద ఎత్తున ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పూణేలోని లుల్లా నగర్ ప్రాంతంలోని ఓ వాణిజ్య భవనంలోని ఏడో అంతస్తులో ఉన్న ఓ రెస్టారెంట్ లో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మార్వెల్ విస్టా కమర్షియర్ భవనంలోని ఏడో అంతస్తులో ఉన్న వెజిటా రెస్టారెంట్ లో ఉదయం 8.15 గంటలకు మంటలు చెలరేగాయి. మంటలను… -
Go Back Modi: ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న “గో బ్యాక్ మోదీ”
"Go Back Modi" trending on Twitter: గుజరాత్ మోర్బీ వంతెన కూలిన ఘటన దేశవ్యాప్తంగా పలువురిని కలిచివేసింది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్రమోదీని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గతంలో పశ్చిమ బెంగాల్ లో ఓ వంతెన కూలిన ఘటనపై మోదీ చేసిన ‘ఆక్ట్ ఆఫ్ గాడ్ కాదు ఆక్ట్ ఆఫ్ ఫ్రాడ్’ అని చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇప్పుడు గుజరాత్ బ్రిడ్జ్ కూలిన ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. -
Russia-Ukraine War: అందుకే ఉక్రెయిన్ విద్యుత్ గ్రిడ్స్‌పై దాడి చేస్తున్నామన్న పుతిన్
Strikes On Ukraine Power Grid In Response To Crimea Attack Says Putin: ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడుతోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. దీంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో సహా పలు నగరాలు, పట్టణాల్లో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. దీంతో చాలా చోట్ల అంధకారం అలుముకుంది. దీంతో పాటు విద్యుత్ లేకపోవడంతో తాగునీటి వంటి మౌళిక సదుపాయాలపై ప్రభావం పడుతోంది. ఇదిలా ఉంటే క్రిమియాలోని తన నౌకాదళంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేయడం వల్లే… -
Gyanvapi mosque case: జ్ఞానవాపీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు కీలక విచారణ
Supreme Court to hear Gyanvapi mosque case on November 10: జ్ఞానవాపీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు కీలక విచారణ జరపనుంది. నవంబర్ 10న ఈ అంశం సుప్రీం ధర్మాసనం ముందుకు రానుంది. ఇప్పటికే ఈ కేసును వారణాసి జిల్లా కోర్టు విచారిస్తోంది. వీడియో సర్వేలో జ్ఞానవాపీ మసీదులో లభించిన శివలింగాన్ని పరిరక్షించాలని మే నెలలో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతోపాటు ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఆదేశించింది.ఈ ఆదేశాల తరువాత మళ్లీ ఇప్పుడే సుప్రీంకోర్టు ఈ అంశాన్ని విచారించనుంది.
తాజావార్తలు
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!