కానిస్టేబుల్ ఉద్యోగాలకు అభ్యర్థుల వయోపరిమితిని 31 సంవత్సరాలకు పెంచాలని అడిగానని… సీఎం కేసీఆర్ 32 ఏళ్లకు పెంచారని… నేను డిమాండ్ చేసిన తర్వాతే సీఎం కేసీఆర్ స్పందించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. మీరు ఉద్యోగాలు ఇస్తోంది వేలల్లో ఉన్నాయని… మిగితా నిరుద్యోగుల పరిస్థితి ఏంటని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు కేఏ పాల్. గత ఎనిమిదేళ్ల నుంచి మీకు చెబుతున్నా… వేడుకున్నా ప్రజాసమస్యలపై కేసీఆర్ స్పందించడం లేదని అన్నారు.
ప్రజాశాంతి పార్టీ బడుగు, బలహీన వర్గాల ఏకైక పార్టీ అని… ఇప్పుడున్న అన్ని పార్టీలపై వ్యతిరేఖత ఉందని అన్నారు. ఇంటికో ఉద్యోగం, రైతులకు న్యాయం చేస్తామని చెబుతున్నారు తప్పితే ఏ ఒక్క హామీ నెరవేర్చడం లేదని విమర్శించారు. ఎన్నికలకు మరో 18 నెలలు ఉన్నాయని కలిసి రాష్ట్రాన్ని డెవలప్ చేద్దాం అని కేసీఆర్ కు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజాశాంతి పార్టీకి టీఆర్ఎస్, కాంగ్రెస్, జనసేనతో పొత్తులు ఉండవని కేఏ పాల్ అన్నారు. అధికారంలోకి రావడానికి నియోజకవర్గాల్లో తిరుగుతా అని అన్నారు.
తెలంగాణను అప్పుల నుంచి విముక్తి చేయగలరా..? అని కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు ఏం చేయలేకపోయాయని విమర్శించారు. ఎలక్షన్లు వస్తున్నాయనే నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారని.. రెండో సారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులు నష్టపోయారని అన్నారు. తెలంగాణను డెవలప్మెంట్ చేసుకుందామని.. ఆంధ్రను అప్పుల నుంచి విడిపించుకుందాం అని కేఏ పాల్ పిలుపునిచ్చారు.