థామస్ కప్, ఉబెర్ కప్ గెలిచిన బ్యాట్మింటన్ టీమ్ లో ప్రధాని నరేంద్ర మోదీ కలిసి ముచ్చటించారు. ప్రస్తుతం ఇండియాకు ‘ ఎస్ మనం దీన్ని చేయగలం ’ అనే వైఖరి శక్తిగా మారిందని ప్రధాని నరేంద్ మోదీ అన్నారు. క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతు ఇస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. మొత్తం దేశం తరుపున జట్టును అభినందిస్తున్నానని మోదీ అన్నారు. థామస్, ఉబెర్ కప్ ను గెలవడం చిన్న విషయం కాదని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.
73 ఏళ్ల తరువాత థామస్ కప్ గెలవడం సంతోషకరం అని… క్వార్టర్ ఫైనల్స్ లో ఓడిపోతే పతకం రాదని తెలిసి తీవ్ర ఒత్తడి ఉండేదని.. మేము గెలవాలని నిశ్చయించుకున్నామని… బ్యాట్మింటన్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్, ప్రధాని మోదీతో ఇంటరాక్షన్ సందర్భంగా అన్నారు. 14 ఏళ్ల బ్యాట్మింటన్ ఛాంపియన్ ఉన్నతి హుడా మాట్లాడుతూ… ప్రధాని మోదీలో నాకు నచ్చే విషయం ఏమిటంటే.. పతక విజేత, పతకం కోల్పోయిన వారి మధ్య ఎప్పుడూ తేడా చూపించరని అంది. ఈ టోర్నీలో ఎన్నో విషయాలు నేర్చుకున్నా అని వెల్లడించింది ఉన్నతి హుడా. మా అథెట్లకు మా ప్రధాని మద్దతు ఉందని చెప్పడానికి గర్వంగా ఉంటుందని ఇది ఆటగాళ్లను మరింత ప్రోత్సహిస్తుందని థామస్ కప్ విజేత కిదాంబి శ్రీకాంత్ అన్నారు.
థామస్ కప్ ను గత 70 ఏళ్ల చరిత్రలో భారత్ ఎప్పుడూ గెలుచుకోలేదు. కనీసం ఫైనల్ కు కూడా చేరలేదు. అలాంటి ఎంతో కఠిన ప్రత్యర్థి అయిని మలేషియాను ఫైనల్స్ లో 3-0తో ఓడించి ఇండియా చరిత్ర సృష్టించింది. 73 ఏళ్లలో తొలిసారిగా ఇండియా థామస్ కప్ టైటిల్‌ను గెలుచుకుంది