దాదాపుగా 30 ఏళ్ల క్రితం రోడు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణం అయిన మాజీ క్రికెటర్, ప్రస్తుతం పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ పాటియాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇటీవల సుప్రీం కోర్ట్ సిద్ధూకు ఒక ఏడాది శిక్ష విధించింది. అయితే అతని ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి డాక్టర్ల బోర్డు ప్రత్యేక ఆహారాన్ని సిఫారసు చేసింది. కొబ్బరి నీళ్లు, లాక్టోజ్ లేని పాలు, జ్యూస్, ఆల్మండ్ ఇలా ప్రత్యేక ఆహారాన్ని సిఫారసు చేసింది.
58 ఏళ్ల సిద్ధూకు ప్రత్యేక ఆహారంలో భాగంగా ఉదయాన్నే ఒక కప్పు రోజ్ మరీ లేదా గ్లాస్ కొబ్బరి నీరు, లాక్టోజ్ లేని పాలు, ఒక టేబుల్ స్పూన్ సన్ ప్లవర్, పుచ్చకాయ గింజలు, టిపిన్ లో ఆరు బాదం పప్పులు, ఒక వాల్ నట్ ను సిఫారసు చేశారు. మధ్యాహ్నం భోజనంలో ఓక గ్యాస్ జ్యూస్, పుచ్చకాయ, కివి, జామ, మొలకెత్తన నల్ల శనగ, పచ్చి శెనగలను సిఫారసు చేశారు. వీటితో పాటు లంచ్, డిన్నర్ లో ఒక గిన్నె దోసకాయ, సీజనల్ గ్రీన్ వెజిటేబుల్స్, రాగులు,జొన్నలతో చేసిన ఒక చపాతీని సిఫారసు చేశారు. సాయంత్రం తక్కువ కొవ్వులు ఉండే పాలు 25 గ్రాముల పనీల్ లేదా టోఫు, ఒక కప్పు టీని సిఫారసు చేసింది. రాత్రి భోజనంలో మిక్సుడ్ వెజిటెబుల్స్, డాల్ సూప్, బ్లాక్ చనా సూప్, పచ్చి కూరగాయలను డాక్టర్లు సిఫారసు చేశారు.
నవజ్యోత్ సిద్ధూ ఎంబాలిజం కండిషన్ అనే కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. 2015లో అక్యూట్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఢిల్లీలో చికిత్స తీసుకున్నాడు. సిరలో రక్తం గడ్డకట్టడం వలన సాధారణ రక్త ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది. ఇదిలా ఉంటే పాటియాలా కోర్టులో అధికారులు సిద్ధూకు క్లరికల్ పనిని అప్పచెప్పారు. ఆయనకు ఓ సహాయకుడిని కూడా నియమించారు. భద్రతా కారణాల వల్ల సిద్ధూ బ్యారెక్ లోనే పనిచేస్తారని అధికారులు చెబుతున్నారు.