దేశ రాజధానిని వడగళ్ల వాన కుదిపేసింది. భారీ గాలి, వడగళ్లతో దేశ రాజధానిని అతలాకుతలం చేసింది. భారీ గాలులులతో చెట్లు కూలిపోయాయి. భారీ వర్షానికి నగర జీవనం ఒక్కసారిగా స్తంభించింది. గంటల తరబడి వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి. గాలి వాన భీభత్సానికి పలువురు మరణించారు. చాలా చోట్ల చెట్లు కూలిపోవడం వల్ల వాహనాలు దెబ్బతిన్నాయి. 2018 తర్వాత వచ్చిన చాలా ప్రభావంతో వచ్చిన వర్షంగా వాతావరణ శాఖ వెల్లడించింది. దాదాపుగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీశాయి.
ఢిల్లీలోని జామా మసీదు ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి వడగళ్ల వాన ధాటికి బాల్కనీలో పడిపోయి చనిపోయాడు. ఉత్తర ఢిల్లీ ప్రాంతంలో వర్షం వల్ల 65 ఏళ్ల వ్యక్తి మరణించారు. రాత్రి 8 గంటల వరకు ఢిల్లీ వ్యాప్తంగా 294 కాల్స్ వచ్చాయని.. చెట్లు కూలిన ఫిర్యాదులు అందాయని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
కబుతార్ మార్కెట్ ప్రాంతంలో వడగళ్ల వాన కారణంగా చెట్లు కింద కారు చిక్కుపోవడంతో చిన్నారితో సహా ముగ్గురిని పోలీసులు రక్షించారు. సాయంత్రం ధాటిగా కరిసిన వర్షానికి ప్రముఖ మసీదైన జామా మసీద్ మిడిల్ డోమ్ దెబ్బతింది. అధికారులు వర్షంతో ఏర్పడిన ఇబ్బందులను నుంచి ప్రజలను తప్పించడానికి అత్యవసర చర్యలు చేపట్టారు.