Venu Goapl Reddy
Author- NTV Telugu-
Congress: హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్‌లో లుకలుకలు.. గుండు కొట్టించుకున్న హస్తం నేత..
Himachal cabinet expansion sparks dissent in Congress: చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అధికారంలో ఉన్న బీజేపీని ఓడించింది. గెలుపొందిన సంతోషంలో ఉన్న కాంగ్రెస్ లో లుకలుకలు కనిసిస్తున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ క్యాబినెట్ విస్తరణ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అసంతృప్తిని రాజేసింది. కాంగ్రా ఎమ్మెల్యే సుధీర్ శర్మ, ఘరావిన్ ఎమ్మెల్యే రాజేష్ ధర్మాని అధిష్టానంపై బహిరంగంగానే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు క్యాబినెట్ విస్తరణపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
Bomb Threat: మాస్కో-గోవా విమానానికి బాంబు బెదిరింపు..ఎమర్జెన్సీ ల్యాండింగ్
Moscow-Goa Flight With 244 Onboard Lands In Gujarat After Bomb Threat: రష్యా రాజధాని మాస్కో నుంచి గోవా వస్తున్న అంజూర్ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విమానాన్ని గుజరాత్ జామ్‌నగర్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో బాంబు ఉందని గోవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు ఈమెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు జామ్ నగర్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విషయం తెలిసిన వెంటనే బాంబ్ స్క్వాడ్‌తో పాటు అగ్నిమాపక సిబ్బంది విమానాశ్రయానికి చేరుకున్నాయి.… -
Viral Video: విడుదలైన ఖైదీకి గ్రాండ్ ఫేర్వెల్ ఇచ్చిన జైలు సిబ్బంది.. వీడియో వైరల్..
Viral Video: అయోధ్య జైలు నుంచి విడుదల అయిన 98 ఏళ్ల వృద్ధుడికి ఘనంగా వీడ్కోలు చెప్పారు జైలు సిబ్బంది. ఇతరులతో గొడవ పడిన కారణంగా ఐపీసీ 452, 323, 352 సెక్షన్ల కింద 98 ఏళ్ల రామ్ సూరత్ అనే వ్యక్తికి జైలు శిక్ష విధించారు. ఐదేళ్ల పాటు ఆయన జైలులో శిక్ష అనుభవించారు. తాజాగా విడుదల అయ్యారు. -
Cold Wave: చలి గుప్పిట ఢిల్లీ..1.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.. స్కూళ్లు బంద్..
Cold Wave In Delhi: ఉత్తరాదిని చలి వణికిస్తోంది. ఢిల్లీతో పాటు హర్యానా, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాలు చలికి వణికిపోతున్నాయి. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు దట్టమైన పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం ఢిల్లీలో 1.9 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. ఇది గడిచిన రెండేళ్లలో జనవరి నెలలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత. ఢిల్లీలోని ప్రైవేట్ స్కూళ్లకు జనవరి 15 వరకు సెలవులను పొడగించింది ప్రభుత్వం. ప్రైవేటు పాఠశాలలు జనవరి 9న పున: ప్రారంభం కావాల్సి ఉన్నా..… -
Kerala: కేరళలో మరో ఫుడ్ పాయిజనింగ్ కేసు.. విద్యార్థులు, పేరెంట్స్‌కు అస్వస్థత
Students, Parents Fall Ill After Eating Food: కేరళలో వరసగా ఫుడ్ పాయిజనింగ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల పతినంతిట్ట జిల్లాలో ఓ చర్చ్ లో బాప్టిజం వేడుకలకు హాజరైన గ్రామస్తులు అక్కడి ఫుడ్ తిని అస్వస్థతకు గురయ్యారు. ఆ తరువాత బిర్యానీ తిని ఓ యువతి మరణించింది. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో జరిగిన ఓ ఈవెంట్ లో విద్యార్థులు, తల్లిందండ్రులు ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. -
Bengaluru: అత్యంతవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా బెంగళూర్.. జాబితాలో హైదరాబాద్ కూడా..
Bengaluru to be the fastest growing city in Asia-Pacific in 2023: దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు ఏవంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేర్లు బెంగళూర్, హైదరాబాద్. ఇప్పుడు ప్రపంచంలో కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెంతున్న నగరాలుగా నిలిచాయి. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ నివేదిక ప్రకారం 2023లో ఆసియా-పసిఫిక్ ప్రాాంతంలో అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న నగరాల్లో బెంగళూర్ ఉంటుందని అంచనా వేసింది. బెంగళూర్ తరువాత హైదరాబాద్ ఉంటుందని నివేదిక తెలిపింది. -
Earthquake: పసిఫిక్ సముద్రంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
Earthquake Strikes Pacific Nation Of Vanuatu: పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం వచ్చింది. పసిఫిక్ దేశం అయిన వనౌటు తీరానికి సమీపంలో ఆదివారం అర్థరాత్రి భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. స్థానిక కాలమాన ప్రకారం రాత్రి 11:30 గంటలకు 7.0 తీవ్రతతో 27కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. భూకంప కేంద్ర పోర్ట్-ఓల్రీ గ్రామానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది. -
Karnataka: కాంగ్రెస్ లీడర్ కొడుకు ఐసిస్ ఉగ్రవాది.. అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
Congress leader's son arrested by NIA for ISIS connection: కర్ణాటకలో ఐసిస్ ఉగ్రవాద లింకులు బయటపడుతున్నాయి. ఏకంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కీలక నేత కొడుకే ఐఎస్ఐఎస్ సంబంధాలు ఉన్నాయి. దీంతో ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) రేషాన్ షేక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది. అతడితో పాటు హుజైర్ ఫర్హాన్ బేగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. రేషాన్ షేక్ ఉడిపి జిల్లాకు చెందిన వాడు కాగా.. ఫర్హాన్ బేగ్ శివమొగ్గ జిల్లాకు చెందిన వాడు. గురువారం… -
Karnataka: శ్రీరామ్ సేన కార్యకర్తపై దుండగుల కాల్పులు..
Sri Ram Sene Leader Injured After Being Shot: కర్ణాటక రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బెలగావిలో శ్రీరామ్ సేన నేతపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. హిందాల్గా గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు శ్రీరామ్ సేన జిల్లా అధ్యక్షుడు రవికుమార్ కోకిట్కర్ తుపాకీతో కాల్పులు జరిపారు. శ్రీరామ్‌సేన కార్యకర్తలు హిందుత్వం కోసం నిలబడతారని, ఇలాంటి దాడులకు భయపడబోమని ఆ సంస్థ చీఫ్ ప్రమోద్ ముతాలిక్ ఈ ఘటనను ఖండించారు. -
Paskistan Crisis: పిండి కోసం తొక్కిసలాట.. కొట్టుకుంటున్న ప్రజలు
Stampedes across Pakistan as flour shortage intensifies: పాకిస్తాన్ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. ఎంతలా అంటే ప్రజలకు పిండి, గ్యాస్ ఇవ్వలేని పరిస్థితి ఉంది అక్కడ. చివరకు గోధుమ పిండి కోసం ప్రజలు కొట్టుకోవడం, తొక్కిసలాటలు జరుగుతున్నాయి. తాజాగా సింధ్ ప్రభుత్వం ప్రజలకు సబ్సిడీపై పిండిని సరఫరా చేసింది. మ ఈ సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడటంతో తొక్కిసలాట జరిగింది. మిర్పుర్ఖాస్ జిల్లాలో ఏడుగురు పిల్లల తండ్రి అయిన వ్యక్తి తొక్కసలాటలో చనిపోయాడు.
తాజావార్తలు
-
SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
-
MLA Danam Nagender : అసెంబ్లీ జీరో అవర్ దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Gurugram: వామ్మో ఇదేం జాడ్యం.. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడికి మద్దతుగా కార్ల ర్యాలీ
-
Suhas Colour Row: నేను తెలుగు ప్రేక్షకులను అనలేదు మహాప్రభో! వివరణ ఇచ్చుకున్న ‘మండాడి’ డైరెక్టర్!
-
iPhone 18 Pro అడిగిన భార్య.. బంగారం అమ్మి మరీ కొనిచ్చిన భర్త..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..