మంత్రి గుమ్మనూర్ జయారామ్, బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు టీడీపీ నేతలు. తాజాగా మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత జయరామ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బెంజ్ కారు మంత్రి జయరామ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. బాలయ్య, ఎన్టీఆర్ అభిమానులు నిన్ను రోడ్డు మీద తిరగనివ్వరని హెచ్చరించారు. బాలకృష్ణ, చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత మంత్రి జయరామ్ కు లేని ఆమె అన్నారు. జగన్ పథకాలు పక్క రాష్ట్రాలకు ఆదర్శం మంత్రి జయరామ్ అంటున్నారు…అక్రమ మద్యం, ఇసుక దోపిడీ, పేకాట క్లబ్ లు , రోడ్ల దుస్థితి, తాగునీటి సమస్య…..ఇవన్నీఆదర్శం అని చెప్పుకోండి అంటూ ఎద్దేవా చేశారు.
బస్సు యాత్ర తుస్సుమన్నాక జయరామ్ కి మతి భ్రమించిందని విమర్శించారు. మంత్రులు జగన్ చుట్టూ భజన చేస్తున్నారు..అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా వైసీపీ నేతలు మారారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. బస్సు యాత్ర తుస్సు మన్నా సిగ్గు రాలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి మూడేళ్ళుగా పట్టి పీడిస్తున్న శని జగన్ అని.. వైసీపీ నేతలకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. మహానాడుకు సముద్రంలా వచ్చిన జనాన్ని చూసి మంత్రులకు మతి భ్రమించిందని అన్నారు. గడప గడపలో ప్రజలు నిలదీస్తుంటే సిగ్గు రాలేదా..? అని ప్రశ్నించారు.
ఇటీవల వైసీపీ సామాజిక న్యాయభేరీ మహాసభలో మంత్రి గుమ్మనూర్ జయరామ్ బాలకృష్ణపై కామెంట్లు చేశారు. గుడిని గుడి లింగాన్ని మింగుతాడని అంటున్నాడని.. నిన్ను హిందూపూర్ లో ఖచ్చితంగా ఓడిస్తామని బాలకృష్ణకు సవాల్ చేశారు. మా జగనన్నతో పెట్టుకుంటున్నావు కదా.. మీసం మెలేసి చెబుతున్నా.. నీ తాట తీస్తాం అని హెచ్చరించారు. చంద్రబాబు మీ నాన్నను వెన్నుపోటు పొడిచాడని జయరామ్ వ్యాఖ్యానించాడు. దీనిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు.