మనీలాండరింగ్ , హవాలా కేసులో ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) దూకుడు పెంచింది. కోల్ కతాకు చెందిన కంపెనీకి హవాలా లావాదేవీలకు సంబంధించిన కేసులో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. దీనిపై ఆప్ పార్టీ భగ్గుమంది. కేంద్రం కావాలనే విపక్షాలను టార్గెట్ చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కావాలనే మా పార్టీకి చెందిన మంత్రులను అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తోంది. బీజేపీ ప్రభుత్వం కేంద్ర సంస్థలతో ప్రతిపక్షాలను బెదిరిస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
సత్యేందర్ జైన్ అరెస్ట్ పై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీస్ సిసోడియా స్పందించారు. సత్యేందర్ జైన్ పై 8 ఏళ్లుగా ఫేక్ కేసు నడుస్తోందని.. ఈడీ ఇంతకుముందు చాలా సార్లు పిలిచిందని.. ఏమి ఆధారాలు దొరకక మధ్యలో చాలా ఏళ్లు కేసు ఆగిపోయందని అన్నారు. హిమాచల్ ప్రదేవ్ పోల్ ఇన్ చార్జ్ గా సత్యేందర్ జైన్ ఉన్నందునే ఇప్పుడు కేసు మళ్లీ మొదలైందని.. కేసు బోగస్ అని మరికొద్ది రోజుల్లో విడుదల చేస్తారని ట్వీట్స్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓటమి పాలవుతుందని.. అందుకే పోల్ ఇన్ ఛార్జ్ గా ఉన్న సత్యేందర్ జైన్ ను అరెస్ట్ చేశారంటూ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే ఇటీవల ఈడీ దూకుడు పెంచింది. మనీలాండరింగ్, హవాలా, అక్రమ వ్యాపారాలపై పలువురు ప్రముఖులను ప్రశ్నిస్తోంది. ఇటీవల మాజీ మంత్రి చిదంబరం కొడుకు కార్తీ చిదంబరంను కూడా ప్రశ్నించారు అధికారులు. మరోవైపు దావుడ్ ఇబ్రహీంతో సంబంధం ఉన్నవారిపై హవాలా కేసులో ముంబైలో రైడ్స్ చేస్తోంది ఈడీ.