బీజేపీ అధిష్టానం తెలంగాణ టార్గెట్ గా బరిలోకి దిగుతోంది. వచ్చే నెలలో జరగబోయే బీజేపీ కార్యవర్గ సమావేశాన్ని ఇందుకు అనుకూలంగా మార్చుకోనున్నాయి. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ లోపే మరింతగా బలపడాలని బీజేపీ భావిస్తోంది. తాజాగా రాష్ట్ర బీజేపీ నేతలకు హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ లో బీజేపీ కార్యవర్గ సమావేశాలు ఎందుకు అనేది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా వివరించాలని హైకమాండ్ ఆదేశించింది. సమావేశాల గురించి ప్రతీ బూత్ స్థాయిలో తెలిసే విధంగా […]
రష్యా, ఉక్రెయిన్ మధ్య యద్దం మొదలై మూడు నెలుల దాటింది. అయినా ఇరు దేశాలు వెనక్కి తగ్గడం లేదు. రష్యా దాడిలో ఉక్రెయిన నగరాలు, పట్టణాలు ధ్వంసం అవుతున్నాయి. తాజాగా లక్సెంబర్గ్ చట్ట సభలను ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ప్రసంగించారు. తన దేశంలో ఐదో వంతు భూభాగాన్ని రష్యా నియంత్రిస్తోందని జెలన్ స్కీ అన్నారు. ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యాలో విలీనం అయిన క్రిమియా ద్వీపకల్పంతో పాటు రష్యాకు మద్దుతుగా నిలుస్తున్న వేర్పాటువాదుల ఆధీనంలో […]
ప్రతీ రాష్ట్రం అభివృద్ధి మేము కట్టుబడి ఉన్నామని.. రాష్ట్రాల అభివృద్ధే దేశ అభివృద్ధి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మోదీ సారథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ చరిత్ర పోరాటాలతో నిండి ఉందని.. తెలంగాణ ఏర్పాటు కోసం యువత ఏళ్ల తరబడి పోరాడి త్యాగాలు చేశారని ఆయన అన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా జూన్, 2014న తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఉనికిలోకి వచ్చిందని అన్నారు. తెలంగాణకు ఏం నిధులు ఇవ్వలేదని […]
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కు షాక్ తగిలింది. కీలక స్థానంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా నెంబర్ 2 స్థానంలో ఉన్న షెరిల్ శాండ్ బర్గ్ మెటా నుంచి వైదొలుగుతున్నారు. 14 ఏళ్ల నుంచి మెటాలో ఎంతో కీలకంగా ఉన్న షరిల్ తన పదవి నుంచి దిగిపోతున్నట్లుగా ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. ఇదిలా ఉంటే బోర్డ్ ఆఫ్ మెంబర్స్ లో మాత్రం సభ్యురాలిగా కొనసాగుతానని వెల్లడించారు. ఫేస్ బుక్ మాతృసంస్థ […]
పట్టణాలతో పల్లెలు పోటీ పడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని.. ఆ సంకల్పం నెరవేరినందునే కేంద్రం నుండి గ్రామపంచాయతీలకు అవార్డులు వచ్చాయన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. నల్లగొండలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి అవార్డులు రావడాన్ని తట్టుకోలేకే అణిచివేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని అన్నారు. డిస్కంలకు లోన్లు మంజూరు కాకుండా అడ్డుపడడం అందులో భాగమే అని ఆరోపించారు. కేంద్రం కరెంట్ రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తోందని అన్నారు. ఇన్ని […]
మూడు నెలలుగా రష్యా ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ నగరాలు, పట్టణాలు, గ్రామాలు సర్వనాశనం అవుతున్నాయి. అయినా అటు రష్యా అధినేత పుతిన్, ఇటు ఉక్రెయన్ అధ్యక్షుడు జెలన్ స్కీ తగ్గడం లేదు. బలమైన రష్యా ముందు కేవలం కొన్ని రోజుల్లోనే లొంగిపోతుందనుకున్న ఉక్రెయిన్, అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాలు ఇస్తున్న సైనిక, వ్యూహాత్మక సహకారంతో రష్యాకు ఎదురొడ్డి నిలుస్తోంది. రాజధాని కీవ్ ను ఆక్రమించుకోవాలని అనుకున్న రష్యాను నిలువరించారు. దీంతో […]
ఎనిమిదేళ్ల క్రితం కొత్త రాష్ట్ర భవిష్యత్తు గురించి ఎన్నో సందేహాలు, ఎన్నో అనుమానాలు ఉండేవని కానీ ఎనిమిదేళ్ల ప్రగతి ఆ అనుమానాలను పటాపంచలు చేసిందని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. దేశంలో ఈ స్థాయిలో న్యాయ వికేంద్రీకరణ జరగడం ఇదే మొదటిసారి అని ఎన్వీ రమణ అన్నారు. న్యాయ వికేంద్రీకరణలో తెలంగాణ అడుగు వేసిందని అన్నారు. 13 జ్యుడిషియల్ యూనిట్ ఏకంగా 35 జ్యడీషియల్ యూనిట్లు గా మారనున్నాయని ఆయన వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి న్యాయశాఖ అభివృద్ధి […]
రాష్ట్రంలో 32 జిల్లా కోర్టులు ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషం, గర్వంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.భారత ప్రధాన నాయమూర్తి ఎన్వీ రమణతో కలిసి సీఎం కేసీఆర్ 32 జిల్లా కోర్టులు ప్రారంభించారు. తెలంగాణ తలసరి ఆదాయం, రాష్ట్ర ఆదాయం, వ్యవసాయ, ఇండస్ట్రీ, ఐటీ గ్రోత్ లో ముందుందని కేసీఆర్ తెలిపారు. గతంలో ఎన్వీ రమణ గారు హైకోర్ట్ చీఫ్ జస్టిస్ గా ఉన్న సమయంలో నేను కోరిన వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి జడ్జీల సంఖ్య పెంచారని.. […]
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 2023లో ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కీసర వేదికగా చింతన్ శిబిర్ కార్యక్రామాన్ని నిర్వహించింది. దీంతో పాటు తెలంగాణలోని సమస్యలు, అధికార పార్టీని ఎలా ఎదుర్కోవాలి, ప్రజల్లో ఎలా ఎండగట్టాలనే విషయాలపై చర్చ జరిగింది. దీంతో పాటు సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయ, సంస్థాగత, రైతులు, యువత ఇలా ఆరు కమిటీలను ఏర్పాటు చేసుకుని తెలంగాణ సమస్యలపై చర్చించారు. బుధవారం, గురువారం రెండు రోజులు చింతన్ శిబిర్ సమావేశాలు నిర్వహించారు. అయితే ఈ సమావేశాల్లో […]
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పదవి కోల్పోయినప్పటి నుంచి వరసగా భారత్ విదేశాంగ విధానాన్ని, పెట్రోల్ రేట్లు తగ్గించడంపై ప్రశంసిస్తున్నారు.తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం సరైన నిర్ణయాలు తీసుకోకుంటే పాకిస్తాన్ మూడు భాగాలుగా విడిపోయి.. అణ్వాయుధాలు లేని దేశంగా మారుతుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే.. ఈ దేశం నాశనం అవుతుందని నేను […]