China-India: మరోసారి చైనా దుర్బుద్ధి.. పాక్ ఉగ్రవాదికి యూఎన్ లో మద్దతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అవకాశం దొరికితే భారత్ ను ఎలా ఇరికించాలనే ఆలోచనతోనే ఉంటుంది డ్రాగన్ కంట్రీ చైనా. మరోసారి తన భారత వ్యతిరేకతను బయటపెట్టింది. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదిని, అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయంలో ఐక్యరాజ్యసమితిలో మోకాలడ్డు పెట్టింది. యూఎన్ సెక్యురిటీ కౌన్సిల్ లో ఐఎస్ఐఎస్, అల్ ఖైదా ఆంక్షల కమిటీ కింద పాక్ ఉగ్రవాద అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ‘ గ్లోబల్ టెర్రరిస్ట్’గా గుర్తించాలని భారత్, యూఎస్ఏ చేసిన ప్రతిపాదనను చైనా తన వీటో పవర్ తో అడ్డుకుంది.
అబ్దుల్ రెహ్మాన్ మక్కీ, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ చీఫ్, 26/11 ముంబై పేలుళ్ల మాస్టర్ మైండ్ హఫీస్ సయూద్ కు స్వయానా బామమరిది. యూఎన్ఓ లో 1267 ఐసిస్, ఆల్ ఖైదా ఆంక్షల కమిటీ కింది మక్కీని గ్లోబల్ టెర్రరిస్టుగ గుర్తించాలని పెట్టిన ప్రతిపాదనలను చివరి నిమిషంలో చైనా నిలిపివేసింది. గతంలో కూడా చైానా పాకిస్తాన్ కు మద్దతుగా నిలచింది. పలువురు ఉగ్రవాదులను గ్లోబల్ టెర్రిరిస్టులుగా గుర్తించేందుకు అంగీకరించలేదు. ఐరాస శాశ్వత సభ్యదేశాలకు ఉండే వీటో అధికారంలో ఈ ప్రక్రియను అడ్డుకుంది.
Also Read
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
గతంలో కూడా చైనా, పాక్ ఉగ్రవాది జైష్-ఎ-మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ విషయంలో కూడా ఇలానే చేసింది. అయితే నాలుగు సార్లు ప్రయత్నించిన తర్వాత మసూద్ అజహర్ ను గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించారు. 2016లో పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి, పుల్వామా దాడిలో ఇతను కీలకంగా వ్యవహరించాడు. గతంలో 2010లో యూఎస్ ట్రెజరీ మక్కీని గ్లోబల్ టెర్రరిస్టుగా పేర్కొంది. దీంతో యూఎస్ లో ఎలాంటి లావాదేవీలు నడపకుండా మక్కీని నిషేధించారు. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ రివార్డ్స్ ఫర్ జస్టిస్ మక్కీ గురించి సమాచారం అందించిన వారికి 2 మిలియన్ డాలర్ల రివార్డ్ అందిస్తామని ప్రకటించింది. అబ్దుల్ రెహ్మన్ మక్కీ ప్రస్తుతం లష్కరే తోయిబాలో విదేశీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, నిధుల సేకరణలో కీలకంగా వ్యహరిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!