US-China War: తైవాన్ విషయంలో చైనా దుందుడుకు చర్యల్ని ప్రారంభిస్తే, అమెరికా ఆ దేశంతో యుద్ధానికి సిద్ధమవుతోందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అమెరికా, చైనాతో యుద్ధానికి వెళ్తే.. జపాన్, ఆస్ట్రేలియా ఎలాంటి పాత్ర పోషిస్తాయని పెంటగాన్ ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా చర్య ఈ రెండు మిత్రదేశాలను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఇటీవలి నెలల్లో, ఆస్ట్రేలియా మరియు జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో జరిగిన సమావేశాలలో US డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ ఆల్బ్రైట్ కోల్బీ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ విషయాన్ని ఫైనాన్షియల్ టైమ్స్ వార్తా పత్రిక నివేదించింది.
Read Also: Air India Crash: ఎయిర్ ఇండియా క్రాష్ రిపోర్టుపై పైలట్ల సందేహాలు..
ఈ చర్యల ఇండో-పసిఫిక్ రీజియన్‌లో మరోసారి టెన్షన్లను పెంచింది. ఈ చొరవ ద్వారా ఈ ప్రాంతంలో మిత్రదేశాలను ఒప్పించడంతో పాటు తైవాన్ విషయంలో సంభావ్య యుద్ధానికి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. బలం ద్వారా శాంతిని సాధించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎజెండాను పెంటగాన్ అమలు చేస్తుందని, మిత్రదేశాల రక్షణ వ్యయాన్ని పెంచాలని, మా సమిష్టి రక్షణకు సంబంధించిన ఇతన ప్రయత్నాలు కూడా ఉన్నాయని కోల్బీ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా తెలిపారు.
“మేము యుద్ధాన్ని కోరుకోవడం లేదు. చైనాపై ఆధిపత్యం చెలాయించడానికి కూడా మేము ప్రయత్నించడం లేదు. దౌత్యాన్ని అమలు చేయడానికి మరియు శాంతికి హామీ ఇవ్వడానికి యునైటెడ్ స్టేట్స్, దాని మిత్రదేశాలు సైనిక శక్తిని కలిగి ఉన్నాయని మేము నిర్ధారిస్తున్నాము” అని చెప్పారు. తైవాన్ విషయంలో చైనా ముప్పును గురించిన ఆందోళన మధ్య రక్షణ వ్యయాన్ని పెంచేందుకు మిత్రదేశాలను ఒప్పించాలని అమెరికా ప్రయత్నిస్తోంది. అమెరికా డిమాండ్ పట్ల జపాన్, ఆస్ట్రేలియాలు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నాయి. అయితే, దీనిపై ఈ రెండు దేశాలు ఇప్పటి వరకు స్పందించలతేదు.