Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్తాన్ సంఘర్షణ గురించి అవే వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య ‘‘అణు యుద్ధం’’గా మారే సంఘర్షణను, వాణిజ్యం ద్వారా తాను ఆపానని సోమవారం ట్రంప్ మరోసారి అన్నారు. ‘‘యుద్ధాలను పరిష్కరించడంలో మేము చాలా విజయాలు సాధించాము. భారత్-పాకిస్తాన్ ఉన్నా్యి. 30 ఏళ్లుగా కొనసాగుతున్న రువాండా-కాంగో ఉన్నాయి’’ అని ట్రంప్ ఓవల్ కార్యాలయంలో నాటో సెక్రటరీ జనరల్ రుట్టేతో జరిగిన సమావేశంలో అన్నారు.
Read Also: Odisha Student: లైంగిక వేధింపుల కారణంగా, నిప్పంటించుకున్న ఒడిశా విద్యార్థిని మృతి..
‘‘ భారత్ పాకిస్తాన్ మధ్య సంఘర్షణ జరుగుతూనే ఉంటే మరో వారం రోజుల్లో అది అణు యుద్ధంగా మారేది, అది చాలా ఘోరంగా మారేది. మేము దీనిని వాణిజ్యం ద్వారా చేశాము. యుద్ధాన్ని ఆపకుంటే మీతో వ్యాపారం చేయనని రెందు దేశాలకు చెప్పా. ఇద్దరు గొప్ప నాయకులు (మోడీ, షహబాజ్ షరీఫ్)లు అలా చేశారు’’ అని అన్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో, రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపినట్లు ట్రంప్ పదే పదే ప్రకటించుకుంటున్నాడు. అయితే, పలు సందర్భాల్లో భారత్ ఈ వ్యాఖ్యల్ని తిప్పికొట్టింది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణలో అమెరికా వ్యాపారం గురించి మాట్లాడలేదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్(డీజీఎఓ) అభ్యర్థన మేరకే, భారత్ కాల్పుల నిలుపుదలకు అంగీకరించిందని చెప్పారు. దీంట్లో మూడో దేశం ప్రమేయం లేదని భారత్ స్పష్టం చేసింది.