Bengaluru: బెంగళూర్‌లోని నమ్మ మెట్రో ‘‘ఎల్లో లైన్’’ త్వరలో ప్రారంభంకాబోతోంది. రాష్ట్రీయ విద్యాలయ రోడ్ (RV రోడ్), బొమ్మసంద్రను కలిపే ఈ మెట్రో లైన్ తుది భద్రతా తనిఖీలు చేస్తు్న్నారు. జూలై 22 నుండి జూలై 25 వరకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ (CMRS) ఈ భద్రతా తనిఖీని నిర్వహిస్తారు. ఎల్లో లైన్ మొత్తం పొడవు దాదాపుగా 18.82 కిలోమీటర్లు ఉంటుంది.
Drone squadrons: భారత్-పాకిస్తాన్ సరిహద్దులు మరింత శత్రు దుర్భేద్యంగా మారనుంది. శత్రు దేశాల నుంచి వచ్చే డ్రోన్లను నిర్వీ్ర్యం చేసేందుకు సరిహద్దుల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) ‘‘డ్రోన్ స్వ్కాడ్రన్’’ను మోహరిస్తోంది. మే 7 నుంచి మే 10 మధ్య పాకిస్తాన్‌తో నాలుగు రోజుల పాటు తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది.
Supreme Court: ఒడిశా బాలాసోర్‌లో ఉపాధ్యాయుడి నుంచి లైంగిక వేధింపులు ఎదురకావడంతో 20 ఏళ్ల బి.ఎడ్ విద్యార్థిని ఆత్మాహుతి చేసుకుని మరణించిన సంఘటనను సుప్రీంకోర్టు "సిగ్గు"గా అభివర్ణించింది. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల బాలికలు, గృహిణులు, పిల్లల సాధికారత కల్పించడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో సూచించాలని సుప్రీంకోర్టు కోరింది. సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదుల సంఘం తరపు న్యాయవాది ఈ సంఘటనను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత న్యాయమూర్తులు సూర్యకాంత్ , జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
Honour killing: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్సుకు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుటుంబాన్ని కాదని పెళ్లి చేసుకున్న ఒక యువ జంటను హత్య చేస్తున్న భయంకరమైన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక గుంపు కారులో రాష్ట్ర రాజధాని క్వెట్టా నుంచి వీరిద్దరిని నిర్జన ప్రాంతంలోకి తీసుకువచ్చినట్లు చూపిస్తోంది. అక్కడే సదరు యువతితో పాటు యువకుడిని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఆ మహిళకు శాలువాతో కప్పిన ఖురాన్ని అందిస్తున్నట్లు వీడియో ఉంది. జన […]
Supreme Court: కన్వర్ యాత్రం మార్గంలోని ఉన్న హోటళ్లు , రెస్టారెంట్లలో క్యూఆర్ కోడ్లను ప్రదర్శించాలని ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఆదేశించాయి.అయితే, ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, రెండు రాష్ట్రాల ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. క్యూఆర్ కోడ్ ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన దరఖాస్తును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Tamil Nadu: గత నెలలో కస్టడీలో అజిత్ కుమార్ అనే 27 ఏళ్ల వ్యక్తి కస్టడీలోనే మరణించడం సంచలనంగా మారింది. తమిళనాడులో జరిగిన ఈ సంఘటనపై అక్కడి డీఎంకే ప్రభుత్వం, పోలీసులపై ఆగ్రహానికి కారణమైంది. దొంగతనం కేసులో ఆలయ సెక్యూరిటీ గార్డు అజిత్ కుమార్‌ని కస్టడీలో పోలీసులు దారుణంగా కొట్టడం, చిత్రహింసలు పెట్టడంతో మరణించారు.
Boeing Jets: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశ వైమానిక చరిత్రలోనే అత్యంత ఘోరమైన దుర్ఘటనగా నిలిచింది. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. విమాన ఇంజన్లకు ఇంధనాన్ని అందించే ‘‘ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్’’లు ఆఫ్ అయిపోయినట్లుగా ఇన్వెస్టిగేటర్లు తేల్చారు. అయితే, ఇలా ఎందుకు జరిగిందనే దానిపై విచారణ జరుగుతోంది.
MiG-21: భారత వైమానిక దళం(IAF)లో 62 ఏళ్ల పాటు సేవలు అందించిన రష్యన్ తయారీ ఫైటర్ జెట్ MiG-21 రిటైర్ కాబోతోంది. చివరి జెట్‌ను సెప్టెంబర్ 19న చండీగఢ్ వైమానిక స్థావరంలోని 23 స్క్వాడ్రన్ (పాంథర్స్) నుంచి ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. 1963లో వైమానిక దళంలో చేరిన మిగ్-21, 1965, 1971లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధాల్లో, 1999 కార్గిల్ యుద్ధం, 2019లో బాలాకోట్ దాడులు, ఆపరేషన్ సిందూర్‌లలో కీలక పాత్ర పోషించింది.
Avenge Murder: దశాబ్ధం క్రితం తన తల్లిని అవమానించి కొట్టిన వ్యక్తిని, ఆ తర్వాత కొడుకు దారుణంగా హత్య చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇలాంటివి మామూలుగా మనం సినిమాల్లో చూస్తుంటాం, కానీ నిజ జీవితంలో కూడా ఓ వ్యక్తి తల్లికి జరిగిన అవమానానికి పగ తీర్చుకున్నాడు. మనోజ్ అనే వ్యక్తిని లక్నో వీధుల్లో పదేళ్ల పాటు వెతికిన సోనూ కశ్యప్ కథ ఇది. హత్య తర్వాత పార్టీ ఇస్తానని చెప్పిన సోనూ, తన ఫ్రెండ్స్‌ని కూడా ఈ ప్లాన్‌లో చేర్చుకున్నాడు.
USA: రష్యాతో స్నేహంపై భారత్, చైనాలను భయపెడుతూ ఇటీవల అమెరికాలో కీలక స్థానాల్లో ఉన్న వారు హెచ్చరికలు చేస్తున్నారు. ఇటీవల నాటో చీఫ్ మాట్లాడుతూ.. రష్యాతో చెలిమి భారత్‌ని దెబ్బతిస్తుందని హెచ్చరించారు. ఇదిలా ఉంటే, తాజాగా అమెరికాకు చెందిన రిపబ్లికన్ సెనెలటర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలు ఆపకపోతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో పాటు చైనాతో సహా అధిక సుంకాలను విధిస్తాడని సెనేటర్ లిండ్సే గ్రాహం హెచ్చరించారు. ట్రంప్ పరిపాలన చమురు…