Karnataka: కర్ణాటక మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అయిన ప్రభు చౌహాన్ కుమారుడు ప్రతీక్ చౌహాన్‌పై అత్యాచారం కేసు నమోదైంది. బీదర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఒక మహిళ ఫిర్యాదు మేరకు కేసు బుక్ చేశారు. పదేపదే అత్యాచారం, నేరపూరిత బెదిరింపులు, దాడికి పాల్పడినట్లు ఆరోపించింది. ఫిర్యాదు ప్రకారం, డిసెంబర్ 25, 2023లో సదరు బాధిత మహిళతో ప్రతీక్ చౌహాన్ ఎంగేజ్మెంట్ జరిగింది. నిశ్చితార్థం తరువాత పెళ్లి హామీతో పలుమార్లు మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపించింది.
CoinDCX: దేశంలో భారీ సెక్యూరిటీ ఉల్లంఘన జరిగింది. భారతదేశంలోని క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలలో ఒకటైన CoinDCX హ్యాక్‌కు గురైంది. ఏకంగా 44 మిలియన్ డాలర్లు( దాదాపుగా రూ. 368 కోట్లు) నష్టం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఈ హ్యాక్ జరిగినట్లు తెలుస్తోంది. కంపెనీ ఇంటర్నల్ ఆపరేషన్ అకౌంట్లలో ఒకదానిని టార్గెట్ చేసుకున్నట్లు తెలిసింది. అయితే, ముంబైకి చెందిన ఈ క్రిప్టో ప్లాట్‌ఫామ్ వినియోగదారుల వ్యక్తిగత నిధులు సురక్షితంగా ఉన్నట్లు హామీ ఇచ్చింది.
Astrologer: పూణేలో 25 ఏళ్ల మహిళను ఓ జ్యోతిష్యుడు లైంగికంగా వేధించినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం ధంకావడి ప్రాంతంలో నిందితుడు అఖిలేష్ అక్ష్మణ్ రాజ్‌గురు(45) ఆఫీసులో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. కాలేజీ విద్యార్థిని అయిన బాధితురాలు తన సోదరుడి జ్యోతిష్యం చార్జును రాజ్‌గురు వద్దకు తీసుకెళ్లింది. అతను జాతకాన్ని పరిశీలించి, మరుసటి రోజు ఒక వస్తువు ఇవ్వాల్సి ఉంటుందని బాధిత మహిళకు చెప్పాడు. Read Also: Rajahmundry: రాజమండ్రి సెంట్రల్ జైలు […]
Maharashtra: మహారాష్ట్ర శంభాజీనగర్‌లో ఓ వ్యక్తి, తనను తాను బాబాగా ప్రకటించుకుని భూతవైద్యం చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ప్రజలను కర్రలతో కొట్టడం, బూట్లు నాకమని బలవంతం చేయడం, వైద్యం పేరుతో ‘‘మూత్రం’’తాగించడం వంటి ఘటనలు సథానిక అధికారుల దృష్టి వచ్చాయి.
LAC: జాతీయ భద్రత, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన రక్షణ సామర్థ్యాలను మరింత విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో వాస్తవ నియంత్రణ రేఖ(LAC) వెంబడి కనెక్టివిటీ పెంచే దిశగా తూర్పు లడఖ్‌లోని ముధ్ న్యోమా వద్ద భారతదేశంలో ఎత్తైన ఎయిర్ ఫీల్డ్ అక్టోబర్ నాటికి పూర్తి చేయనుంది. సముద్రమట్టానికి దాదాపు 13,700 అడుగుల ఎత్తులో ఉన్న న్యోమా భారత్-చైనా సరిహద్దుల్లో ఎల్ఏసీకి దగ్గరగా ఉన్న అడ్వాన్సుడ్ ల్యాండింగ్ గ్రౌండ్(ALG).
Madhya Pradesh: మధ్యప్రదేశ్ సియోని జిల్లాలో దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. నదిలో నుంచి చెప్పులు తీసేందుకు ప్రయత్నించిన 20 ఏళ్ల వ్యక్తి, అందులో జారిపడి కొట్టుకుపోయాడు. అతడి స్నేహితులు చూస్తుండగానే నీటిలో మునిగిపోయాడు. సరదాగా పిక్నిక్ వెళ్లిన సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
Bitra island: భారతదేశం తన వ్యూహాత్మక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. హిందూ మహాసముద్రంలో భారత్ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని అనుకుంటోంది. ఈ మేరకు ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను అభివృద్ధి చేయడంతో పాటు, అక్కడ త్రివిధ దళాలను మోహరిస్తోంది. ముఖ్యంగా, భారత నేవీ కోసం అనేక కొత్త ఏర్పాట్లను చేస్తోంది. ఉద్రిక్త సమయంలో చైనాకు సరకు రవాణా కట్ చేసేలా, మలక్కా జలసంధిని కంట్రోల్ చేసేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. Read Also: Honeymoon: హనీమూన్ కోసం […]
Tamil Nadu: తమిళనాడులో దారుణం జరిగింది. భార్యపై కోపంతో ఏకంగా ఆమెను పొడిచి చంపేశాడు ఓ భర్త. రాష్ట్రంలోని కరూర్ జిల్లాలోని కులితలై ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి చంపేశాడు. నిందితుడిని విశృత్‌గా గుర్తించారు. ఘటన తర్వాత అక్కడ నుంచి పారిపోయిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ISKCON: లండన్ లోని ఇస్కాన్ గోవింద రెస్టారెంట్లో షాకింగ్ సంఘటన జరిగింది. ప్రసిద్ధ శాఖాహార సంస్థగా పేరున్న ఈ రెస్టారెంట్లోకి ఆఫ్రికా సంతతికి చెందిన ఒక బ్రిటిష్ వ్యక్తి మాంసం తీసుకువచ్చి తిన్నాడు. కావాలని కేఎఫ్‌సీ చికెన్ తీసుకువచ్చి రెస్టారెంట్లో గలాటా చేశాడు. రెస్టారెంట్లో కేవలం శాఖాహారం మాత్రమే వడ్డిస్తారని తెలియగానే, కావాలనే తన చేతిలో ఉన్న బకెట్ నుంచి చికెన్ ముక్కలు తీసి తినడం ప్రారంభించారు. రెస్టారెంట్లో పనిచేసే వ్యక్తులు ఎంత వారిస్తున్నా, వినకుండా అక్కడ ఉన్న కస్టమర్లు, సిబ్బందిని అసహనానికి గురిచేశాడు.
Monsoon session: సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి కిరెన్ రిజిజు అన్నారు. కేంద్రం ఏ అంశానికి దూరంగా ఉండదని, సభ సజావుగా నడిచేందుకు కట్టుబడి ఉందని ఆయన ఆదివారం అన్నారు. అఖిలపక్ష సమావేశం తర్వాత ఆయన మాట్లాడుతూ.. సభ సక్రమంగా జరిగేలా ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సమన్వయం ఉండాలని కోరారు.