Tayfun Block-4: పాకిస్తాన్‌తో ఫ్రెండ్షిప్ చేస్తున్న టర్కీ ఇప్పుడు తన మొదటి ‘‘హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్’’ని తయారు చేసింది. ‘‘టేఫన్ బ్లాక్’’ అనే క్షిపణిని ఇస్లాంబుల్‌లో జరిగిన అంతర్జాతీయ రక్షణ పరిశ్రమ ప్రదర్శన (IDEF) 2025లో ప్రదర్శించింది. ఈ కొత్త క్షిపణిని టర్కిష్ రక్షణ సంస్థ రోకెట్సన్ డెవలప్ చేసింది. ఇది టర్కీ దేశీయంగా తయారు చేసిన అత్యంత పొడవైన బాలిస్టిక్ మిస్సైల్ అయిన టేఫన్కు హైపర్సోనిక్ వెర్షన్.
Bengaluru: బెంగళూర్ లోని కలాసిపాల్య బస్టాండ్‌లో పేలుడు పదర్థాలు పట్టుబడటం భయాందోళనలకు గురిచేసింది. స్థానిక పోలీసులు, ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) బస్టాండ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బస్టాండ్‌లో సమీపంలోని ప్లాస్టిక్ కవర్లో దాచిన ఆరు జెలిటిన్ స్టిక్స్ దొరికాయి. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పట్టుబడటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
US: అమెరికా మరోసారి విదేశీ పౌరులకు బిగ్ వార్నింగ్ ఇచ్చింది. భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం అమెరికాలో ఉంటున్న విదేశీ పౌరులకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. దాడి, గృహహింస, ఇతర తీవ్రైన నేరాల వంటి నేరాల్లో అరెస్టులు జరిగితే, తక్షణమే వీసా రద్దుకు దారితీయవచ్చని, భవిష్యత్తులో అమెరికాలోకి ప్రవేశించడానికి అర్హతను ప్రమాదంలో పడేస్తాయని స్పష్టం చేసింది
Mumbai Airport: ప్రపంచంలో బెస్ట్ టాప్ -10 ఎయిర్‌పోర్టుల్లో ముంబై విమానాశ్రయం చోటు దక్కించుకుంది. వరసగా మూడో ఏడాది కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMIA) ట్రావెల్ + లీజర్ వరల్డ్స్ బెస్ట్ అవార్డ్స్ 2025లో ప్రపంచంలోని టాప్ 10 అంతర్జాతీయ విమానాశ్రయాలలో ఒకటిగా ఎంపికైంది. 84.23 రీడర్ స్కోర్‌తో, ఏడాది జాబితాలో చోటు దక్కించుకుంది.
Jackfruit: ‘‘పనస పండు’’ తిని వాహనాలు నడుపుతున్నారా..? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్లే. ఒకవేళ పోలీసులు ‘‘డ్రంక్ అండ్ డ్రైవ్’’ టెస్ట్ నిర్వహిస్తే, మీరు మద్యం తాగకున్నా తాగినట్లు రీడింగ్ చూపించే అవకాశం ఉంది. కేరళకు చెందిన ఈ సంఘటనకు పరిశీలిస్తే అసలు విషయం అర్థమవుతుంది. ముగ్గు
Air India Crash: ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరణించిన యూకే జాతీయులకు సంబంధించిన ఓ వార్త సంచలనంగా మారింది. బాధిత కుటుంబాలకు రెండు మృతదేహాలు తప్పుగా పంపించినట్లు బాధిత కుటుంబాల న్యాయవాది తెలిపారు. ప్రమాదంలో మరణించిన ప్రయాణికులు మృతదేహాలకు తిరిగి డీఎన్ఏ టెస్ట్ నిర్వహించడగా, కనీసం రెండు శవ పేటికల్లో వ్యత్యాసాలు వెల్లడయినట్లు ఆరోపించారు. ఈ రెండు మృతదేహాల అవశేషాలు బాధిత కుటుంబాలతో సరిపోలలేదని తెలుస్తోంది.
Akhilesh Yadav: ఓ మసీదులో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్‌లు సందర్శించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ ఇద్దరు నేతలపై విరుచుకుపడుతోంది. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఇటీవల పార్లమెంట్ సమీపంలోని ఒక మసీదును సంరద్శించారు. మతపరమైన ప్రాంతంలో రాజకీయా సమావేశాలు నిర్వహించడం ఏమిటని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఈ సమావేశంలో డింపుల్ యాదవ్ ధరించిన దుస్తులపై కూడా వివాదం చెలరేగింది.
Australia: ఆస్ట్రేలియాలో ఒక భారతీయులు దారుణమైన జాతి వివక్షను ఎదుర్కొన్నారు. కొందరు దుండగులు అతడిని దుర్భాషలాడుతూ, తీవ్రంగా దాడి చేశారు. గత వారం దక్షిణ ఆస్ట్రేలియన్ నగరమైన అడిలైడ్‌లో ఓ కార్ పార్కింగ్ వివాదంలో, గుర్తు తెలియని వ్యక్తులు చరణ్‌ప్రీత్ సింగ్ అనే వ్యక్తిపై దాడి చేశారు. కింటోర్ అవెన్యూలో శనివారం రాత్రి 9.22 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది.
Vice presidential poll: సోమవారం జగదీప్ ధంఖర్ ఆకస్మిక రాజీనామాతో భారత ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయింది. వైద్య కారణాలను చూపుతూ ధంఖర్ సోమవారం సాయంత్రం ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముకు పంపారు, తక్షణమే తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. దీంతో మరోసారి ఎన్నికలు అనివార్యమయ్యాయి.
Bihar: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో సవరణలు చేపడుతోంది. బీహార్ ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 52 లక్షలకు పైగా పేర్లు తొలగించినట్లు ఎన్నికల సంఘం మంగళవారం తెలిపింది. తుది ఓటర్ల జాబితా సెప్టెంబర్ 30, 2025న ప్రచురించబడుతుంది. ఆగస్టు 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించబడుతుంది. తొలగించిన పేర్లలో చనిపోయినట్లు నివేదించబడిన 18 లక్షల మంది ఓటర్లు, ఇతర నియోజకవర్గాలకు వెళ్లిన 26 లక్షల మంది, […]