Avenge Murder: దశాబ్ధం క్రితం తన తల్లిని అవమానించి కొట్టిన వ్యక్తిని, ఆ తర్వాత కొడుకు దారుణంగా హత్య చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇలాంటివి మామూలుగా మనం సినిమాల్లో చూస్తుంటాం, కానీ నిజ జీవితంలో కూడా ఓ వ్యక్తి తల్లికి జరిగిన అవమానానికి పగ తీర్చుకున్నాడు. మనోజ్ అనే వ్యక్తిని లక్నో వీధుల్లో పదేళ్ల పాటు వెతికిన సోనూ కశ్యప్ కథ ఇది. హత్య తర్వాత పార్టీ ఇస్తానని చెప్పిన సోనూ, తన ఫ్రెండ్స్‌ని కూడా ఈ ప్లాన్‌లో చేర్చుకున్నాడు. కొబ్బరినీళ్లు అమ్ముకునే మనోజ్‌ని చంపిన కారణంగా నిందితులు సోనూ, రంజీత్, ఆదిల్, సలాం, రెహ్మత్ అలీలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Eternal Shares Jump: జొమాటో సంచలనం.. రెండు రోజుల్లో రూ. 52 వేల కోట్ల సంపాదన…
మనోజ్ సుమారు 10 ఏళ్ల క్రితం జరిగిన ఓ వివాదంలో సోనూ తల్లిని కొట్టి ఆ ప్రాంతం నుంచి పారిపోయాడు. తన తల్లికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని అప్పటి నుంచి అనుకుంటున్నాడు. మనోజ్ కోసం గత 10 ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నాడు. చివరకు మూడు నెలల క్రితం మనోజ్‌ని లక్నోలోని మున్షి పులియా ప్రాంతంలో చూశాడు. అప్పుడే హత్య చేయాలని ప్రణాళిక రెడీ చేశాడు. మనోజ్ రోజూవారీ షెడ్యూల్‌పై రెక్కీ నిర్వహించాడు. మే 22న, మనోజ్ తన దుకాణంలో ఒంటరిగా ఉండటం గమనించి, ఇనుప రాడ్‌లతో దాడి చేసి కొన ప్రాణాలతో వదిలేశారు. మనోజ్ చికిత్స పొందుతూ మరణించాడు.
పోలీసుల దర్యాప్తులో, నిందితులు ఎక్కడా కూడా సీసీ టీవీ కెమెరాల్లో కనిపించలేదు. దీంతో వారు నిందితుల్ని పట్టుకోలేకపోయారు. అయితే, హత్య అమలు చేసిన తర్వాత తన స్నేహితులకు సోనూ పెద్ద ఎత్తున మద్యం పార్టీ ఇచ్చాడు. వీరంతా ఫోటోలు తీసుకుని ఎంజాయ్ చేశారు. కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో రావడంతో పోలీసులు వీరిని గుర్తించేందుకు సాయపడ్డాయి. నిందితులు ఐదుగురిలో ఒకరిని ఈ ఫోటోల సాయంతో పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన సమయంలో ఒక నిందితుడు ధరించిన ఆరెంజ్ కలర్ టీ షర్టు సాయంతో మొత్తం ఈ హత్యను ఛేదించారు.