Fighter jets: భారత్ తన రక్షణ సామర్థ్యాలను పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్, చైనా నుంచి పొంచి ఉన్న ముప్పు దృష్ట్యా దేశీయ రక్షణ పరికరాలకు ప్రాధాన్యత ఇస్తూనే, విదేశీ టెక్నాలజీ వెపన్స్‌ను కూడా కొనుగోలు చేస్తోంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం భారతదేశం 5వ తరం యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం, ఈ ఫైటర్ జెట్లు కేవలం రష్యా, అమెరికా, చైనా వద్ద మాత్రమే ఉన్నాయి. రష్యా తన ఫిఫ్ట్ జనరేషన్ ఫైటర్ జెట్ Su-57ని భారత్‌కు ఆఫర్ చేసింది. అమెరికా కూడా తన ఎఫ్-35 జెట్‌లను భారత్‌కు అమ్మాలని చూస్తోంది.
Read Also: Pawan Kalyan: హరిహర వీరమల్లు 2 రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా!
ఈ నేపథ్యంలో భారత్ విదేశాల నుంచి 2 నుంచి 3 స్వ్కాడ్రన్ల(40-60 విమానాలు) 5వ తరం యుద్ధ విమానాలను తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. రక్షణ కార్యదర్శి ఆర్.కె. సింగ్ నేతృత్వంలోని సాధికారత కలిగిన కమిటీ ఉత్తర,పశ్చిమ సరిహద్దుల్లో బలగాల సంసిద్ధతను పెంచడానికి 5వ తరం యుద్ధవిమానాలను సైన్యంలో చేర్చుకోవాలని సిఫారసు చేసింది. చైనా ఇప్పటికే ఆరో తరం యుద్ధ విమానాలపై పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ 5వ తరం యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భావిస్తోంది.
ప్రస్తుతం, భారత్ స్వదేశీ అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్ట్ ద్వారా ఐదో తరం యుద్ధ విమానాల తయారీని ప్రోత్సహిస్తోంది. ఈ యుద్ధవిమానం తయారయ్యే వరకు విదేశాల నుంచి అడ్వాన్సుడ్ జెట్‌లను తీసుకోవాలని భారత సైన్యం భావిస్తోంది. ప్రస్తుతం, మన వద్ద ఉన్న రాఫెల్ యుద్ధవిమానాలు 4.5 జనరేషన్‌వి. ఇటీవల, రష్యా తన Su-57 యుద్ధవిమానాలను భారత్‌కు ఆఫర్ చేయడంతో పాటు, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌కి అంగీకరించిందని తెలుస్తోంది.