India-UK Free Trade Deal: భారత్-యూకే మధ్య వాణిజ్య ఒప్పందం, రైతులకు ఎలా లాభం అంటే..
- ‘‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’’పై భారత్ యూకే సంతకం..
- భారతీయ రైతులు, మత్స్య పరిశ్రమకు మరింత లాభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-UK Free Trade Deal: భారత్, యూకే మధ్య ‘‘స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)’’ కుదిరింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు యుకె ప్రధాని కీర్ సమక్షంలో వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ మరియు బ్రిటిష్ వాణిజ్య మంత్రి జోనాథన్ రేనాల్డ్స్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు.
ఈ ఒప్పందం భారతదేశ రైతులకు ప్రయోజనం చేకూర్చబోతోంది. భారత వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఉత్పత్తులు ఇప్పుడు బ్రిటిష్ మార్కెట్‌లో సుంకాలు ప్రవేశించే వెసులుబాటు దొరికింది. భారత రైతులు, యూరప్ దేశాల రైతుల కన్నా మెరుగైన ప్రయోజనాలు పొందుతారు. పసుపు, మిరియాలు, యాలకుల వంటి భారతీయ ఉత్పత్తులు, మామిడి గుజ్జు, ఊరగాయలు, పప్పు ధాన్యాలు, ప్రాసెస్ చేసిన ఉత్పత్తులు కొత్త ఒప్పందం ప్రకారం సుంకాలు లేకుండా యూకే మార్కెట్‌లోకి వెళ్తాయి. ఇది రైతుల మార్కెట్ పరిధిని పెంచుతుంది. వారికి లాభాలను తీసుకువస్తుంది.
Also Read
- Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
Read Also: RSS: ముస్లిం, హిందువుల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ఆర్‌ఎస్‌ఎస్ యత్నం..!
యూకే నుంచి వచ్చే దిగుమతులు కూడా విస్తారమైన భారతీయ మార్కెట్ లోకి ప్రవేశిస్తాయి. అయితే, సున్నితమైన భారత దేశ వ్యవసాయ రంగాన్ని బ్రిటిష్ దిగుమతుల నుంచి రక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెబుతోంది. దేశీయ రైతులపై ప్రభావం పడకుండా చూసుకోవడానికి పాల ఉత్పత్తులు, ఆపిల్స్, ఓట్స్,తినదగిన నూనెలపై ఎటువంటి సుంకం రాయితీలు ఉండవు.
ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారతదేశ మత్స్య రంగానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ మరియు తమిళనాడు వంటి తీరప్రాంత రాష్ట్రాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. యూకేలో ప్రస్తుతం 4.2 శాతం నుంచి 8.5 శాతం వరకు రొయ్యలు, ట్యూనా, చేపలు, మాంసంపై సుంకాలు ఉన్నాయి. ఈ ట్రేడ్ డీల్ తర్వాత ఈ ఉత్పత్తులు ఎలాంటి సుంకం లేకుండా యూకే మార్కెట్‌లోకి వెళ్తాయి. తోలు, ఫుట్ వేర్, దుస్తుల ఎగుమతి కూడా సులభం అవుతుంది. యూకే నుంచి దిగుమతి చేసుకునే కార్లు, విస్కీ, వైద్య పరికరాలు భారతదేశానికి చౌక ధరలకు దొరుకుతాయి.
తాజావార్తలు
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!