Congress camp politics in Himachal Pradesh elections: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించే దిశగా పరుగులు పెడుతోంది. 150 సీట్ల కన్నా ఎక్కువ స్థానాలు సాధించి ఏడో సారి అధికారంలోకి రానుంది. ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్ ప్రజలు మాత్రం ఇటు బీజేపీకి కానీ అటు కాంగ్రెస్ పార్టీకి కానీ స్పష్టమైన మెజారిటీ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 68 స్థానాలు ఉంటే 35 స్థానాలు వచ్చిన పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుంది. అయితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య క్షణక్షణం ఫలితాలు తారుమారు అవుతున్నాయి.
Read Also: World Richest Person: ప్రపంచ కుబేరులు.. ఫస్ట్ ప్లేస్ కోల్పోయిన ఎలాన్ మస్క్.. వివరాలు ఇవిగో..
దీంతో ఏమాత్రం అధిక్యత లభించిన కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలు ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. అయితే హిమాచల్ లో కూడా మేమే అధికారంలోకి వస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యతన ప్రదర్శించే అవకాశం ఉందని తెలిపిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రానికి ప్రత్యేక దూతలను పంపింది. చత్తీస్ గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ భాఘెల్ ను అక్కడి పంపింది కాంగ్రెస్ పార్టీ. ఆయనే అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఒక వేళ ఎవరికి స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో క్యాంపు రాజకీయాలకు తెర లేపాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎమ్మెల్యేలను రాజస్తాన్ తరలించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఫలితాలను బట్టి కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులను ఒక చోటుకు రావాలని కాంగ్రెస్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హిమాచల్ ప్రదేశ్ లో ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు. ప్రస్తుతం లీడింగ్ లో ఉన్న ఎమ్మెల్యేల్లో ముగ్గురు బీజేపీ రెబల్స్ ఉండగా.. ఒకరు కాంగ్రెస్ రెబల్ ఉన్నారు.