Honour killing: తమిళనాడులో 25 ఏళ్ల దళిత యువకుడి హత్య సంచలనంగా మారింది. దీనిని ‘‘పరువు హత్య’’గా భావిస్తున్నారు. తూత్తుకుడికి చెందిన కవిన్ తిరునెల్వెలిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి సమీపంలో హత్యకు గురయ్యాడు. కవిన్ ఒక ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి కేటీసీ నగర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నా తన మాజీ స్కూల్ విద్యార్థినితో సంబంధం ఉందని తెలుస్తోంది. అమ్మాయి కుటుంబం నుంచి వ్యతిరేకత వచ్చినా, కవిన్ ఆమెను పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడు.
Read Also: XXX vs Union of India: సుప్రీంకోర్టు పిటిషన్‌లో గుర్తింపు దాచిన జస్టిస్ వర్మ.. “XXX”గా పేరు..
ఆదివారం ఆమెను కలిసేందుకు ఆమె పనిచేస్తున్న ఆస్పత్రికి వెళ్లాడు. ఆమె సోదరుడు సుర్జీత్ అతని వద్దకు వచ్చి మాట్లాడాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య వాదన చెలరేగింది. ఆ సమయంలో సుర్జీత్ ఆస్పత్రికి కేవలం 200 మీటర్ల దూరంలో కొడవలితో కవిన్‌ని నరికి చంపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయిన సుర్జీత్, పాలయంకొట్టై పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. తమకు న్యాయం జరిగేదాకా మృతదేహాన్ని తీసుకోమని కవిన్ కుటుంబీకులు చెబుతున్నారు. సుర్జీత్‌పైనే కాకుండా, పోలీసు శాఖలో పనిచేస్తున్న అతడి తండ్రి శరవణన్, తల్లి కృష్ణకుమారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.