New Mahindra Thar: మహీంద్రా థార్, ఈ కారు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. ఆఫ్ రోడింగ్ సామర్థ్యం ఉన్న ఈ కారు ఇటీవల కాలంలో భారీ అమ్మకాలను నమోదు చేసుకుంది. తాజాగా కొత్త థార్ జనవరి 9న భారతదేశంలో విడుదల కానున్నట్లు సమాచారం. గతంతో పోలిస్తే ఈసారి థార్ ధర మరింతగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడున్న థార్ లా కాకుండా కొత్తగా రాబోతోన్న థార్ 1.5 లీటర్ డిజిల్ ఇంజన్ ను కలిగి 2 వీల్ డ్రైవ్ తో రాబోతోంది. దీంతో కారు ధర కూడా తగ్గనుంది. ఎంట్రీ లెవల్ వేరియంట్ థార్ ధర రూ.10 లక్షల(ఎక్స్-షోరూమ్) కంటే తక్కువ ఉండే అవకాశం ఉంది.
Read Also: Breaking News: హైదరాబాద్ జేఎన్టీయూ వద్ద అగ్నిప్రమాదం.. తగులబడుతున్న బస్సు
కొత్తగా వస్తున్న థార్ 1.5 లీటర్ డిజిల్ ఇంజన్ తో 117 బీహెచ్పీ శక్తితో 300 న్యూటన్ మీటర్ టార్క్ ను జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో రాబోతోంది. ప్రస్తుతం ఉన్న థార్ 4 వీల్ డ్రైవ్ ధర రూ. 13.59 లక్షల నుంచి రూ.16.29 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది. కొత్తగా రాబోతోన్న థార్ ధర రూ. 10 లక్షల కన్నా తక్కువ ఉండే అవకాశం ఉంది.
ప్రస్తుతం థార్ 5 డోర్ కారును తీసుకు వచ్చే ఆలోచనలో మహీంద్రా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మారుతి సుజుకీ ఈ సెగ్మెంట్ లో 5 డోర్లు కలిగిన జిమ్నీని తీసుకువస్తోంది. ఈ రెండు కార్ల మధ్య పోటీ నెలకొననుంది. స్కార్పియో-N, స్కార్పియో క్లాసిక్, థార్, XUV700, XUV300, బొలెరో వాహనాల సాయంతో మహీంద్రా 2022లో 3,35,088 యూనిట్లను అమ్మింది.