Foreign Tourist Harasses Flight Attendants On GO First’s Delhi-Goa Flight: విమానాల్లో ప్రమాణికలు అకృత్యాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే న్యూయార్క్-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి సీనియర్ సిటిజెన్ పై మద్యం మత్తులో యూరిన్ చేశాడు. దీని తర్వాత పారిస్-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే మరో విమాన ఘటనల తాజాగా వెలుగులోకి వచ్చింది.
Read Also: KA Paul : రెచ్చగొడితే రెచ్చిపోవద్దు.. నేనున్నాను
జనవరి 5న న్యూఢిల్లీ నుంచి గోవాకు వెళ్లే గో ఫస్ట్ విమానంలో ఒక విదేశీ ప్రయాణికుడు, మహిళ ఫ్లైట్ అటెండెంట్ తో అనుచితంగా ప్రవర్తించాడు. తనతో కూర్చోవాలని, అసభ్యకరంగా మాట్లాడారని అంటెండెంట్ ఆరోపించింది. దీంతో నిందితుడిని మోపాలోని గోవా కొత్త విమానాశ్రయంలో భద్రతా సిబ్బందికి అప్పగించారు. దీంతో పాటు ఎయిర్ లైన్స్ రెగ్యులేటరీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీసీసీఏ)కు సమాచారం అందించారు. గోవాలో కొత్త విమానాశ్రయం ప్రారంభం అయిన తొలిరోజే ఈ ఘటన జరిగింది.
నవంబర్ 26న ఎయిరిండియా న్యూయార్క్- న్యూఢిల్లీ విమానంలో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో 70ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజెన్ అయిన మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ కేసులో నిందితుడు శంకర్ మిశ్రాను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఢిల్లీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఎయిర్ ఇండియా మిశ్రాపై 30 రోజుల పాటు నిషేధాన్ని విధించింది. దీంతో పాటు ఈ ఘటన తర్వాత ప్రయాణికుల వికృత చేష్టలపై డీజీసీఏ కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది.