Siddha Ramaiah criticizes Prime Minister Narendra Modi: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి హిట్లర్, ముస్సోలినీలతో పోల్చాడు. దీనిపై బీజేపీ ఫైర్ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ పాలన మరికొద్ది రోజులు మాత్రమే ఉంటుందని జోస్యం చెప్పాడు. ప్రధానమంత్రిని రానీవ్వండి మాకు ఎలాంటి సమస్య లేదని.. బీజేపీ అధికారంలోకి వస్తుందని వందసార్లు చెప్పినా.. అలా జరగదని సిద్ధరామయ్య ఆదివారం స్పష్టం చేశారు.
Read Also: IT layoffs: 4 నెలల్లో 3 కంపెనీలు ఉద్యోగం నుంచి తొలగించాయి.. ఓ టెక్కీ ఆవేదన
హిట్లర్ కు ఏమైంది.. అతడు కొన్ని రోజుల ఆడంబరంగా తిరిగాడు.. ముస్సోలిని, ఫ్రాంకోలకు ఏమైంది..? ప్రధాని మోదీకి కూడా కొన్ని రోజులే ఉంటాడు అని ఆయన అన్నాడు. దీనిపై బీజేపీ ఘాటుగానే స్పందించింది. కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై మాట్లాడుతూ.. ప్రధాని వ్యక్తిత్వ యావత్ దేశానికి తెలుసని.. ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా ఆయన్ను దెబ్బతీయలేరని అన్నారు. భారతదేశంలో 130 కోట్ల మందికి మోదీ గురించి తెలుసని.. ఎవరో ఏదో చెబితే ఏమి చేయలేరని.. గుజరాత్ లో కూడా కాంగ్రెస్ ఇలాగే మాట్లాడిందని.. అయినప్పటికీ బీజేపీ అత్యధిక ఓట్లతో గెలిచిందని.. కర్ణాటకలో కూడా ఇదే జరుగుతుందని బొమ్మై అన్నారు.
ఇదిలా ఉంటే కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కాంగ్రెస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గేను అంగీకరించడానికి సిద్ధరామయ్య సుముఖంగా లేరని..రాహుల్ గాంధీ సిద్ధాంతాలకు మాత్రమే ఆమోదం లభిస్తుందని విమర్శించారు. ప్రధాని మోదీ ప్రజల చేత ఎన్నుకోబడిన నేత అని.. నియమించబడలేదని.. గాంధీ పరివార్ లాగా కాదని అన్నారు.