‘ఐబొమ్మ’ అనే వెబ్ సైట్ దాదాపు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి పరిచయమే.. అయితే దీని వల్ల సినిమా ఇండస్ట్రీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ‘ఐబొమ్మ’ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రవిని నాంపల్లి కోర్టుకు తరలించి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. విచారించిన జడ్జి ఇమ్మడి రవికి 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే తాజాగా రవి తండ్రి అప్పారావు తన కొడుకు గురించి సంచలన విషయాలు బయటపెట్టారు. BSNL లో రిటైర్ అయిన చిరుద్యోగి రవి తండ్రి అప్పారావు. స్థానికంగా చిన్న ఇంట్లో జీవనం కొనసాగిస్తున్నారు. అప్పారవు మాట్లాడుతూ..
Also Read:Andhra Pradesh:విశాఖలో మేనేజ్ మెంట్ ఇన్ స్టిట్యూట్ హోటల్ ప్రాజెక్ట్.. 2000 మందికి ఉపాధి
నా కొడుకు తప్పుడు మార్గంలో వెళ్లాడని నాకు తెలియదు.. డిగ్రీ వరకు చదివించాను.. ఫ్రెండ్స్ తో కలిసి నెట్ వర్కింగ్ చేస్తున్నానని చెప్పాడు. కానీ ఇలా తప్పుడు పనులు చేస్తున్నాడని తెలియదని అన్నారు.
పోలీసులను చాలెంజ్ చేసే అంత మొనగాడా.. ప్రభుత్వాన్ని ఎదిరిస్తే ఊరుకుంటారా అంటూ మండిపడ్డారు. తప్పు చేశాడని నిర్దారించారు కనుకే పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. చట్ట ప్రకారం ఎలాంటి శిక్షకు అర్హుడో నిర్ధారించి చర్యలు తీసుకుంటారన్నారు. కోట్లు సంపాదించాడని, కానీ విదేశాలకు వెళ్లాడని కానీ నాకు తెలియదు..
Also Read:Bride Killed: పెళ్లికి గంట ముందు, కాబోయే భర్త చేతిలో వధువు హత్య..
రెండేళ్ల క్రితం వైజాగ్ నుంచి వెళ్లిపోయాడు.. అప్పుడప్పుడు వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయేవాడు.. నా కోడలు మంచిది.. ప్రేమించానని చెబితే దగ్గర ఉండి పెళ్లి చేశాను.. ఆమెతో కూడా విడిపోయాడని తెలిసింది.. గొడవలు పడుతున్నాం రమ్మని మా కోడలు పిలిచింది.. నాకు ఆరోగ్యం సహకరించక వెళ్లలేదన్నారు. నెలకు రూ.10 వేల రూపాయల మందులు కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నాను.. నా కొడుకు దగ్గర కోట్లు వున్నట్టు తెలియదని అప్పారావు వెల్లడించారు.