ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇదే మంచి సమయం. ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటార్ సైకిళ్లను తయారు చేసే దేశీయ సంస్థ అయిన ఓలా ఎలక్ట్రిక్, ఓలా సెలబ్రేట్స్ ఇండియా అనే గొప్ప పండుగ ఆఫర్‌ను ప్రారంభించింది. దీని కింద ఎలక్ట్రిక్ వాహనాల ప్రారంభ ధర రూ. 49,999 గా నిర్ణయించింది. ఈ ఆఫర్ ముహూర్త మహోత్సవ్ పేరుతో ప్రారంభించింది. ఇది రాబోయే తొమ్మిది రోజుల పాటు కొనసాగుతుంది. ఈ స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు రూ. 49,999 […]
దేశంలో సాధారణ వాణిజ్య విభాగంలోని వాహనాలతో పాటు, ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఆటోమొబైల్ కంపెనీలు సరికొత్త ఈవీ వాహనాలను తీసుకొస్తున్నాయి. యూలర్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ మినీ ట్రక్కును విడుదల చేసింది. భారత మార్కెట్లో యూలర్ టర్బో EV 1000 ను విడుదల చేసింది. ఈ మినీ ఎలక్ట్రిక్ ట్రక్కును కళ్లు చెదిరే ఫీచర్లతో విడుదల చేశారు. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, యూలర్ కొత్త ట్రక్కు అనేక వినూత్న లక్షణాలను కలిగి ఉంది. […]
బంగారం ధరలు దడపుట్టిస్తున్నాయి. వేలకు వేలు పెరుగుతూ వణికిస్తున్నాయి. గోల్డ్ ధరలు రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. తులం గోల్డ్ ధర రూ. లక్షా 15 వేల వైపు పరుగులు తీస్తోంది. పుత్తడి బాటలోనే సిల్వర్ పయనిస్తోంది. కిలో వెండి ధర రూ. లక్షా 49 వేలకు చేరింది. ఇవాళ గోల్డ్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ఒక్కరేజే రూ. 1260 పెరిగింది. కిలో సిల్వర్ ధర రూ. 1000 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం […]
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హీరో మోటోకార్ప్ తన కొత్త, స్టైలిష్ స్కూటర్ డెస్టినీ 110 ను విడుదల చేసింది. ఇది అనేక అద్భుతమైన ఫీచర్లతో వస్తోంది. డెస్టినీ 110 నియో రెట్రో డిజైన్‌ను కలిగి ఉంది. ఇది ఆధునిక ఫీచర్ల, క్లాసిక్ లుక్లతో అట్రాక్ట్ చేస్తోంది. ఇది ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంప్‌లు, H-ఆకారపు LED టెయిల్ ల్యాంప్‌లు, ప్రీమియం క్రోమ్ యాక్సెంట్లను కలిగి ఉంది. ఇది ప్రత్యేకంగా మూడు పెద్ద మెటల్ బాడీ ప్యానెల్లతో రూపొందించారు. ఇది […]
ఉత్తర ప్రదేశ్ లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ జిల్లాలోని అమ్మాయిలు చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి పారిపోతున్నారు. ప్రతిరోజూ ఎనిమిది నుండి పది మంది బాలికలు తమ కుటుంబాలకు తెలియజేయకుండా తమ ప్రియమైన వారి కోసం పారిపోతున్నారు. వీరిలో టీనేజర్లు మాత్రమే కాదు, యువతులు కూడా ఉన్నారు. ఏకంగా ఒక్క నెలలోనే 164 కేసులు నమోదయ్యాయి. కారణాలు తెలిసి పోలీసులే షాక్ అవుతున్నారు. Also Read:H-1B Visa Fee: ట్రంప్ H-1B చర్యలు భారత్ కన్నా అమెరికా […]
కానిస్టేబుల్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నవారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ అందించింది. ఏకంగా ఏడు వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2025 కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. పురుష, మహిళా అభ్యర్థులకు కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి 7,565 ఖాళీలను ప్రకటించింది. ఈ నియామక డ్రైవ్‌లో మాజీ సైనికులకు రిజర్వ్ చేయబడిన పోస్టులు కూడా ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు […]
ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తారు. అమాయకులు, బలం లేని వాళ్లు ఉంటే ఇక అంతే.. బెదిరించడం లేదా దాడులు చేయడం కామన్ అవుతోంది. పైగా కొంత మంది అధికారుల అండదండలతో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. కానీ అలాంటి వారికి చెక్ పెడుతున్నారు పోలీసులు. ఇదిగో ఇది ఆదిలాబాద్‌లోని మావల. ఇక్కడ ఓ వ్యక్తి 2011 కొనుగోలు చేసిన 7 ప్లాట్లను ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు మరో రాజకీయ పార్టీ నేత కలిసి 2024లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. […]
పోస్టు మాస్టర్ ఇంటికి కన్నం వేశాడు…. ఓ అసిస్టెంట్ పోస్టు మాస్టర్. ప్రజలకు పంపిణి చేసే పెన్షన్ డబ్బులను కాజేశాడు. ఈజీ మనీ కోసం తన స్నేహితునితో కలిసి స్కెచ్ వేసి మరీ 8 లక్షల రూపాయలు కొట్టేశాడు. చివరకు కటకటాలపాలయ్యాడు. రాష్ట్ర స్దాయిలో ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. తపాల శాఖ ఉద్యోగితో పాటు అతని స్నేహితున్ని అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మామిడిల్లికి […]
తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ సిటీ ఏరియాను ప్రజల మౌలిక వసతులకు నిలువుటద్దం పట్టే గ్లోబల్ సిటీకి చిరునామాగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మానవ జీవన ప్రమాణాలకు కొలమానమైన విద్య, వైద్యం, రోడ్డు రవాణా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని సీఎం అన్ని విభాగాల ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. సిటీ విస్తరణలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి ప్రజలు గ్రేటర్ సిటీకి లక్షలాది కుటుంబాలు […]
తెలంగాణలో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఉరుములు, మెరుపుల కారణంగా ప్రజలు ప్రాణ భయంతో వణికిపోయారు. కుండపోత వర్షం పలు కుటుంబాల్లో విషాధాన్ని నింపింది. ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఏటూరునాగారం (మం) చల్పాక గ్రామంలో లో పిడుగు పడి ఊకె కృష్ణ కృష్ణ అనే రైతు మృతి చెందాడు. చిట్టిబాబు అనే మరో రైతుకు గాయాలు అయ్యాయి. పంట పొలంలో పనులకు వెళ్లిన సమయంలో ఘటన చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా, […]