Xiaomi 17 Pro, Xiaomi 17 Pro Max చైనాలో లాంచ్ అయ్యాయి. ఇవి బ్రాండ్ తాజా, అత్యంత శక్తివంతమైన ఫోన్లు. వీటిలో Qualcomm Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉంది. ఈ స్మార్ట్ఫోన్లు Android 16 ఆధారంగా HyperOS 3 పై పనిచేస్తాయి. ఇటీవల ఆపిల్ ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లను విడుదల చేసిన విషయం తెలిసిందే. షియోమి తాజా ఫోన్లు చైనాలో ఐఫోన్‌తో నేరుగా పోటీ పడనున్నాయి. […]
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సింగిల్ గర్ల్ చైల్డ్ మెరిట్ స్కాలర్షిప్ కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 10వ తరగతి CBSE పరీక్షలో ఉత్తీర్ణులై 11, 12 తరగతుల్లో తదుపరి విద్యను అభ్యసిస్తున్న ప్రతిభావంతులైన ఒంటరి బాలికలకు మద్దతు ఇవ్వడం ఈ పథకం లక్ష్యం. 10వ తరగతి CBSE పరీక్షల్లో 70% లేదా అంతకంటే ఎక్కువ స్కోరు సాధించిన.. 11, 12వ తరగతుల్లో చదువు కొనసాగించే వారికి అందిస్తారు. దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ […]
చెన్నై జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విద్యలో ముందంజలో తమిళనాడు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు సంతోషంగా ఉంది. అన్నాదొరై, కరుణానిధి, కామరాజ్ వంటి గొప్ప యోధుల జన్మస్థలం తమిళనాడు అని అన్నారు. కరుణానిధి విజన్‌ను అమలు చేస్తున్న స్టాలిన్, ఉదయనిధిలను అభినందిస్తున్నానని తెలిపారు. ఇందిరాగాంధీ కామరాజ్ ప్లాన్‌ను తీసుకువచ్చారు.. కామరాజ్ తమిళనాడులో తీసుకువచ్చిన విద్యా విధానాన్ని దేశం అనుసరిస్తోంది.. ఈ కార్యక్రమం […]
వరంగల్ నగర మాజీ మేయర్ అరెస్ట్ అయ్యారు. భవిత శ్రీ చిట్ ఫండ్ సంస్థలో పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో భవిత శ్రీ చైర్మన్, మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావును అరెస్టు చేశారు హన్మకొండ పోలీసులు.. హనుమకొండ లో ఉన్న భవిత శ్రీ చిట్ ఫండ్ లో చిట్టీలతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన బాధితులు.. గడువు పూర్తయినప్పటికీ డబ్బులు చెల్లించకపోవడంతో భవిత శ్రీ చిట్ ఫండ్ చైర్మన్ గుండా ప్రకాష్ రావుతోపాటు […]
హైదరాబాద్ మెట్రో రైల్ పై కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ మెట్రో నుండి ఎల్ ఎండ్ టి తప్పుకున్నది. తెలంగాణ ప్రభుత్వం, ఎల్&టీ సీఎండీకి మధ్య ఒప్పందం కుదిరింది. ఇకపై తెలంగాణ ప్రభుత్వం చేతిలోకి హైదరాబాద్ మెట్రో రైల్. ప్రభుత్వమే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఉదయం మెట్రో అధికారులతో సీఎం రేవంత్ భేటి అయ్యారు. మెట్రో రైల్ నెట్వర్క్ పొడవు పరంగా 2014లో దేశంలో రెండవ స్థానంలో ఉన్న హైదరాబాద్ ఇప్పుడు దేశంలో 9వ స్థానానికి పడిపోయింది.ఎల్&టీ […]
తెలంగాణ పోలీస్ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇకపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సైబర్ నెరగాళ్లతోపాటు సోషల్ మీడియాలో పదేపదే అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై హిస్టరీ షీట్ ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాను ఉపయోగించి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారిపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. సోషల్ మీడియా కేంద్రంగా నేరాలకు పాల్పడితే హిస్టరీ షీట్ ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా ద్వారా […]
ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. దసరాకు లక్కీ డ్రా నిర్వహించేందుకు రెడీ అయ్యింది. ప్రయాణికులు ఆర్టీసీ బస్సెక్కితే బహుమతులు అందించాలని నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో రీజియన్‌కి ముగ్గురు చొప్పున 33 మందికి రూ.5.50 లక్షల విలువగల బహుమతులను సంస్థ అందజేయనుంది. ఒక్కో రీజియన్‌కు ప్రథమ బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలను సంస్థ ప్రకటించింది. Also Read:Telangana : తెలంగాణలో దసరా షాపింగ్ బీభత్స […]
అంగన్వాడి కేంద్రాలకు దసరా సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. రేపటి నుంచి ఎనిమిది రోజులపాటు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 27 నుంచి అక్టోబర్ నాలుగు వరకు అంగన్వాడీలకు దసరా సెలవులు ఉండనున్నాయి. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల విజ్ఞప్తి మేరకు దసరా సెలవులు మంజూరు చేయాలని అధికారులకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క టేక్ హోమ్ రేషన్ విధానంలో లబ్ధిదారులకు పోషకాహారాన్ని అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. Also Read:AP Politics […]
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 పోస్టుల తుది ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 563 ఖాళీలలో, ఒక పోస్టుపై హైకోర్టులో విచారణ ఉన్నందున 562 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ ఫలితాల్లో ఓ కానిస్టేబుల్ సత్తాచాటారు. ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ మండలం పెప్పర్ వాడకు చెందిన శశిధర్ రెడ్డి(కానిస్టేబుల్) గ్రూప్-1 ఫలితాల్లో ఏ టి ఓ ఉద్యోగం సాధించి ఆదర్శంగా నిలిచారు. కానిస్టేబుల్ నుంచి గ్రూప్ వన్ కు ఎంపికై కష్టపడితే […]
రాజస్థాన్‌లోని దాబ్లా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో బుధవారం మహేంద్రగఢ్‌లోని బిజెపి మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు మాయా సైని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. రాజస్థాన్ రైల్వే పోలీసులు ఆమె ఫోటోను సమీపంలోని పోలీస్ స్టేషన్లకు పంపడం ద్వారా ఆమెను గుర్తించారు. ఆమె నార్నాల్ సమీపంలోని నివాజ్నగర్ నివాసి. ఆమె గతంలో గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. ప్రస్తుతం బిజెపి జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు […]