కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ పై బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. నటి రన్యా రావు తరపున ఆకుల అనురాధ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో నటిపై అసభ్యకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి యత్నాల్ పరువు నష్టం కలిగించారని ఆరోపించారు. పోలీసులు బీజేపీ ఎమ్మెల్యేపై బిఎన్ఎస్ సెక్షన్ 79 కింద కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని బీజాపూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి […]
ప్రపంచమంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న సుధీర్ఘ విరామానికి తెరపడింది. భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చింది. బుచ్ విల్మోర్ కూడా ఆమెతో తిరిగి వచ్చాడు. బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు క్యాప్సూల్స్ ఫ్లోరిడా తీరంలో విజయవంతంగా ల్యాండింగ్ అయ్యింది. ఇద్దరు వ్యోమగాములతో స్పేస్ఎక్స్ క్రూ-9 భూమికి తిరిగి వచ్చింది. అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తిరిగి రావడానికి 17 గంటలు పట్టింది. క్యాప్సుల్స్ సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది. నాసా సిబ్బంది […]
మూసీ ప్రక్షాళనపై తెలంగాణ శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు కీలక విషయాలు వెల్లడించారు. మూసీ ప్రక్షాళన జరగకుండా ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. అయినా… ఈ విషయంలో ప్రభుత్వం వెనకడుగేయదని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళనకు అన్ని పార్టీలు సహకరించాలి. డీపీఆర్ రూపకల్పనలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నా. మూసీ ప్రక్షాళన పేరిట బీఆర్ఎస్ పార్టీ హడావుడి చేసింది. కానీ.. చేసిందేం లేదు. చిన్న చిన్న తప్పులను భూతద్దంలో చూపించడం సరి కాదు. ప్రతి […]
వరంగల్ నగరంలో మైనర్ బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వ్యభిచార ముఠా నిర్వహిస్తున్న కీలక నిందితురాలు ముస్కులత. మైనర్ లతో వ్యభిచారం చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని మైనర్ సెక్స్ రాకెట్ ఏర్పాటు చేసేందుకు ఓ యువతితో ప్లాన్. దీనిలో భాగంగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ సహాయంతో మైనర్ బాలికను ట్రాప్ చేసిన యువతి. ఆ తర్వాత తన లవర్ తో కలిసి మైనర్ బాలికకు మద్యం, గంజాయికి అలవాటు […]
తెలంగాణ శాసన మండలిలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ పై కీలక విషయాలు వెల్లడించారు. రీజినల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్ కి 2016లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అన్నారు. 2017లో కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. అయితే గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవరించడం వల్ల రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు వెనుకబడుపోయిందని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత RRR ను పట్టాలెక్కించామని అన్నారు. […]
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ సినిమాల్లో అవకాశాల పేరుతో యువతులను ఆకర్షించి విటుల వద్దకు పంపుతూ దారుణాలకు ఒడిగట్టింది. ఫిలిం కాస్టింగ్ మేనేజర్ నంటు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ యువతలను ఆకర్షించింది నాగమణి అనే మహిళ. ఆతర్వాత వారిని విటుల వద్దకు పంపుతు వ్యభిచార కూపంలోకి దింపుతోంది. విశ్వసనీయ సమాచారంతో హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు, సరూర్ నగర్ పోలీసులు నాగమణినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. Also Read:Care Hospital: […]
బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో తాము భయాందోళనకు గురయ్యామని ఆమె వాపోయారు. ఈ ఘటనపై అలర్ట్ అయిన పోలీసులు ఆగంతుకుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో డీకే అరుణ ఇంట్లోకి చొరబడిన ఆగంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదుపులో ఉన్న వ్యక్తి ఢిల్లీకి చెందిన అక్రమ్ గా పోలీసులు గుర్తించారు. గతంలో ఢిల్లీతోపాటు పాతబస్తీలోను చోరీలు చేసినట్లు సమాచారం. పశ్చిమ మండల డీసీపీ […]
తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసన తెలిపారు.18 ఏళ్ళు పైబడిన చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆందోళన చేపట్టారు. ఎలక్ట్రిక్ స్కూటర్ పోలిన ఫ్లకార్డ్స్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా హామీలు అమలు చేయకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన బాట పట్టారు. Also Read:Danam Nagender: ఇది సీరియస్ మ్యాటర్.. జీరో అవర్ లో […]
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ జీరో అవర్‌లో అధికారుల తీరుపై ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. ఈద్గా గ్రౌండ్ పక్కన క్యాంపు ఆఫీస్‌కు స్థలం ఇవ్వమని అడిగా. అధికారుల నుంచి సరైన స్పందన లేదన్నారు దానం. అప్లై..అప్లై..నో రిప్లై అన్నట్లు పరిస్థితి ఉందన్నారు. అధికారుల మీద ప్రివిలేజ్ నోటీస్ ఇస్తా.. నాకు సమాచారం ఇవ్వకుండా సబ్ స్టేషన్ ఏర్పాటు చేశారు.. అధికారులు, అధికారులు మాట్లాడుకుని కాంప్రమైజ్ అవుతున్నారు.. ఎమ్మెల్యేలు చెప్పినా వినడం లేదు. నేను […]
నిర్లక్ష్యం, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం వంటి కారణాలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మితిమీరిన వేగంతో, అజాగ్రత్తగా వాహనాలను నడుపుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న బైకు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువతి తీవ్రంగా గాయపడింది. గాయపడిన ఆమెను కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. […]