కులగణనతోనే సామాజిక న్యాయం సాధ్యమని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కులగణను చేపడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటకలో పూర్తైంది. అయితే కర్ణాటకలో మాత్రం కులగణన సర్వేపై విమర్శలు వెల్లువెత్తాయి. కర్ణాటకలో ఈ సర్వేపై వొక్కలిగ,లింగాయత్ వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ సర్వేలో న్యాయమైన ప్రాతినిధ్యం లేదని వారు ఆరోపించారు.
Also Read:Honeymoon Murder: భర్తని చంపి సోనమ్ ఎలా తప్పించుకుంది.. పోలీసులకు ఎక్కడ అనుమానం వచ్చింది..?
ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో కొత్త కుల గణన నిర్వహించాలని కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఆదేశించిందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఈరోజు తెలిపారు. రాష్ట్రంలో మరోసారి కులగణన చేయనున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు. విమర్శలకు తావు లేకుండా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ సూచించినట్లు తెలిపారు.