కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) పరీక్ష 2025 కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంలో గ్రూప్ బి, సి పోస్టులకు ప్రతి సంవత్సరం SSC CGL అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష జరుగుతుంది. ఈసారి వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో 14,582 ఖాళీలు భర్తీ చేయనున్నారు. వీటిలో ఆదాయపు పన్ను అధికారి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అకౌంటెంట్ వంటి జాబ్స్ ఉన్నాయి.
Also Read:TPCC Mahesh Goud : పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించారు
SSC CGL 2025 కి దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. నిర్దిష్ట పోస్ట్‌ను బట్టి వయోపరిమితి 18- 32 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయస్సులో సడలింపు ఉంటుంది. పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా ఉంటుంది. టైర్-1 పరీక్ష 2025 ఆగస్టు 13 నుంచి ఆగస్టు 30 వరకు జరుగుతుంది. టైర్-2 డిసెంబర్ 2025లో జరుగుతుంది. జనరల్, ఓబీసీ, EWS కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 100 చెల్లించాలి. SC, ST, PH, మహిళా అభ్యర్థులు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవారు జులై 4 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.