ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇంగ్లాండ్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ ప్రశంసలు కురిపించారు. తెలంగాణ రైజింగ్-2047పై సీఎం రేవంత్ రెడ్డిని టోనీ బ్లెయిర్ ప్రశంసించారు. రేవంత్ రెడ్డికి లేఖ ద్వారా అభినందనలు తెలిపాడు టోనీ బ్లెయిర్. ఇటీవల ఢిల్లీలో టోనీబ్లెయిర్తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ తెలంగాణ రైజింగ్ విజన్-2047 గురించి టోనీబ్లెయిర్కు వివరించారు. తెలంగాణ రైజింగ్ విజన్-2047లో నిర్దేశించుకున్న 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ, పెట్టుబడుల సాధన, రైతులు, మహిళా, యువ […]
ములుగు జిల్లా వాజేడు మండలం చేరుకూరు మోతుకులగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో మహిళా రైతుతో పాటు నాలుగు పశువులు మృతి చెందాయి. వృద్ధ రైతు దంపతులు సొంత పంట పొలంలో చెట్లు, కమ్మలు తొలగిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చెట్టు నరుకుతుండగా చెట్టుకొమ్మ విద్యుత్ తీగలపై పడింది. బరువు ఎక్కువగా ఉండడంతో విద్యుత్ తీగలు తెగి కిందపడ్డాయి. Also Read:Weight loss Injection: బరువు తగ్గించే ఇంజెక్షన్ ‘వేగోవి’ విడుదల.. ధర […]
తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకే రాష్ట్రపతికి బీసీ బిల్ పంపారని బిజెపి ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ రేవంత్ సర్కార్ పై మండిపడ్డారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చెయ్యాలి అంటే.. ఆ బిల్ ను 9 వ షెడ్యూల్ లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని తెలిపారు. కానీ రాష్ట్రపతి కి పంపారు.. రాష్ట్రపతి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మాకు తెలియదు. తమిళనాడు రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో కేసు ఉంది. బిల్ ను కేంద్రాన్ని […]
ప్రస్తుత రోజుల్లో సమాజంలో జరుగుతున్న దారుణాల పట్ల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. హనుమంత రావు మాట్లాడుతూ.. సమాజంలో భర్తలను భార్య.. తల్లినీ.. బిడ్డ చంపడం చూస్తుంటే బాధ ఐతుందన్నారు. ఒకప్పుడు ఫ్యాక్షన్ మర్డర్స్ జరిగేవి. ఇప్పుడు లవ్ మర్డర్స్ జరుగుతున్నాయని తెలిపారు. అబ్బాయి, కానీ అమ్మాయి కానీ మీకు నచ్చకపోతే పెళ్లి చేసుకోకండి.. మీకు నచ్చిన వారినే చేసుకోండని సూచించారు. సమాజం ఎక్కడికి పోతుంది..? యమధర్మ రాజుతో కూడా భర్త […]
తెలంగాణలో లా సెట్,పీజీ ఎల్ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టా రెడ్డి, ఓయూ విసి కుమార్, కన్వీనర్ విజయ లక్ష్మి పలితాలు విడుదల చేశారు. పరీక్షకు హాజరైన వారిలో 66.46 శాతం క్వాలిఫై అయినట్లు అధికారులు తెలిపారు. 57 వేల 715 మంది రిజిస్టర్ చేసుకోగా 45 వేల 609 మంది పరీక్షకు హాజరయ్యారు. 30 వేల 311 మంది అర్హత సాధించారు. లా సెట్ రాసిన వారిలో బి కామ్, బి […]
ఏనుగు దంతాల రవాణాకు పాల్పడుతున్న ముఠాలను రాచకొండ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. మూడు కోట్ల రూపాయల విలువైన రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. నిందితుడు ఏపీకి చెందిన రేకులకుంట ప్రసాద్ ని అరెస్ట్ చేశారు. ప్రసాద్ వద్ద నుంచి రెండు ఏనుగు దంతాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో రెండు ఏనుగు దంతాల విలువ రూ. 3 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. […]
భార్యలు, భర్తలను చంపడం, పిల్లలు తల్లిదండ్రులను చంపడం చూస్తుంటే మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతోందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరో ఘటనలో తనను ప్రేమించినప్రియుడు మరొకరితో పెళ్లికి సిద్ధమవడంతో ఆ యువతి ప్రశ్నించింది. ఇద్దరి మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకుంది. చివరకు ప్రియుడు ప్రేమించిన యువతిని ఐదవ అంతస్తు నుంచి తోసేసి అంతమొందించాడు. ఈ ఘటన ఢిల్లీలోని అశోక్ నగర్లో చోటుచేసుకుంది. ఈ కేసులో 26 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. […]
తెలంగాణ క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాబినెట్ సుదీర్ఘంగా జరిగిందన్నారు. ఈనెల 16న సీఎం చేతుల మీదుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 9 రోజుల్లో 9 వేల కోట్ల రైతు భరోసా చెల్లించాము.. వ్యవసాయం దండగ కాదు పండగ అని చెబుతున్నాం.. రాష్ట్ర రైతుల పక్షాన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపాము.. రేపు సెక్రటేరియట్ ముందు రైతు సంబురాలు జరపాలని నిర్ణయించినట్లు […]
నేడు సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం అయ్యింది. నాలుగున్నర గంటలుగా క్యాబినెట్ సమావేశం కొనసాగింది. కాసేపటి క్రితమే తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రైతు భరోసా పంపిణీ, ఏపీ తలపెట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి తదుపరి కార్యాచరణపై మంత్రివర్గం చర్చించింది. త్వరలో సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సిఎల్పీ లో పార్టీ నేతలకు బనకచర్ల పై ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. Also Read:CM Chandrababu: డబుల్ ఇంజిన్ సర్కారు ఎలా […]
పాస్పోర్ట్ దరఖాస్తుదారుల పోలీసు ధృవీకరణ ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం అత్యుత్తమ ప్రదర్శనతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ విజయానికి కారణం తెలంగాణ పోలీసులు అభివృద్ధి చేసిన VeriFast యాప్. ఇది పాస్పోర్ట్ ధృవీకరణ ప్రక్రియను వేగవంతంగా, ఖచ్చితంగా, పారదర్శకంగా, అత్యుత్తమమైన ప్రజాప్రయోజనకారిగా రూపుదిద్దుకుంది. విదేశాంగశాఖ తాజా జాతీయ గణాంకాల ప్రకారం, తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యంత వేగంగా పాస్పోర్ట్ ధృవీకరణను పూర్తి చేస్తూ, తక్కువగా మూడు పని దినాల్లోనే ఎక్కువశాతం కేసులను పరిష్కరిస్తున్నారు. Also […]