Vice President Election 2025: రేపు భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక.. సీక్రెట్ బ్యాలట్ విధానంలో..
- రేపు భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు
- సీక్రెట్ బ్యాలట్ విధానంలో ఎన్నికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశ ఉపరాష్ట్రపతి పదవి కోసం సెప్టెంబర్ 9 అంటె రేపు ఎన్నిక జరగనుంది. ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి లు ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ పడుతున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. వెనువెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు వెల్లడించనున్నారు. “ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్”గా వ్యవహరించనున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ పి.సి. మోడి. “ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్”కు సహాయకులుగా మరో ఇద్దరు “ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు” నియమించారు.
Also Read:Hyundai: జీఎస్టీ తగ్గింపుతో, రూ.2.4 లక్షల వరకు తగ్గిన హ్యుందాయ్ కార్‌ల ధరలు..
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్‌ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
ఓటు వృధా కాకుండా ముందు జాగ్రత్తగా అధికార, ప్రతిపక్ష కూటములు “మాక్ ఓటింగ్” నిర్వహించారు. పార్టీలు జారీ చేసే “విప్” లు చెల్లవు..“సీక్రెట్ బ్యాలట్” విధానంలో ఎన్నికలు జరగనున్నాయి. అధికార “ఎన్.డి.ఏ” కూటమి అభ్యర్థి గెలుపు పై ధీమా ఉన్నా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న బిజేపి. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు పాత పార్లమెంట్ భవనం లోని “సెంట్రల్ హాల్” లో “మాక్ ఓటింగ్” లో “ఇండియా” కూటమి పక్షాల ఎంపీలు పాల్గొననున్నారు. ఈ రోజు సాయంత్రం “ఎన్.డి.ఏ” కూటమి పక్షాల ఎంపీల “మాక్ ఓటింగ్”. పార్లమెంటు ఉభయ సభలు—లోకసభ, రాజ్యసభ—కు చెందిన సభ్యులతో పాటు, నామినేటెడ్ సభ్యులు కూడా ఓటర్లుగా ఉండనున్నారు.
Also Read:iPhone 17 Series: ఐఫోన్ 17 సిరీస్ స్పెసిఫికేషన్స్ లీక్.. కొత్త ఫీచర్లపై భారీ అంచనాలు!
ఉపరాష్ట్రపతి ఎన్నుకునేందుకు ఓటింగ్ లో పాల్గొననున్న మొత్తం 782 మంది సభ్యులు.. లోకసభ లోని 543 మంది సభ్యులు ( ప్రస్తుతం 1 స్థానం ఖాళీ, రాజ్యసభ లోని 233 మంది సభ్యులు ( ప్రస్తుతం 5 ఖాళీలు), 12 మంది రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యులు ఓటర్లు. సింపుల్ మెజారిటీ తో గెలుపొందనున్న అభ్యర్థి.. మొత్తం సభ్యులు ఓటింగ్ లో పాల్గొంటే, 392 ఓట్లు వచ్చిన అభ్యర్థిదే గెలుపు. చెల్లుబాటైన ఓట్లలో సగాని కంటే ఒక్క ఓటు అధికంగా వచ్చిన అభ్యర్ధిదే గెలుపుగా పరిగణిస్తారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?