హైదరాబాద్ లో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల డెకరేషన్ ఆపరేషన్ నిర్వహించారు. చర్లపల్లి డ్రగ్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. రోజు వారి కూలీగా వెళ్లిన ముంబై పోలీసు గుట్టురట్టు చేశాడు. కానిస్టేబుల్ ను ఆ కంపెనీలో కూలీగా పంపి డ్రగ్స్ తయారీ జరుగుతున్నట్లు పక్కాగా నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత చర్లపల్లి లోని వాగ్దేవి ల్యాబ్ లో మెరుపు దాడులు చేశారు. ప్రధాన నిందితుడు శ్రీనివాస్ & విజయ్ ఓలేటి, తానాజి పట్వారీ అరెస్ట్.. బంగ్లాదేశీ యువతి అరెస్టుతో డ్రగ్ డెన్ గుట్టురట్టైంది.
Also Read:Rekha Gupta-AAP: ప్రభుత్వ సమీక్షలకు సీఎం రేఖా గుప్తా భర్త హాజరు.. ఆప్ తీవ్ర విమర్శలు
ముంబై శాంతి భద్రతల ఏసీపీ దత్తాత్రేయ శిందే, క్రైమ్ బ్రాంచ్, (డివి ఇన్-4) ఇన్స్పెక్టర్ ప్రమోద్ నేతృత్వంలో దర్యాప్తు సాగుతోంది. పోలీస్ టీమ్స్ దశల వారీగా డ్రగ్స్ సరఫరా నెట్ వర్క్ ఛేదించారు. ఒకటి రెండు దశలో ఉండే వ్యక్తులు ఎవరూ? మూడో దశలో ఉండే వారికి తెలియకుండా ప్రధాన నిందితుడు శ్రీనివాస్ విజయ్ ఓరేటి జాగ్రత్తలు ఎలా తీసుకున్నారు?.. బంగ్లా యువతి పాతిమా హైదరాబాద్ లో నెట్ వర్క్ పై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇప్పటివరకు 10 మందిని అరెస్టు చేశారు. ముడిపదార్థాలపై అసలు పేర్లు కాకుండా.. ఇతర లేబుళ్లను అంటించి, హైదరాబాద్ తరలించిన ఓలేటి గ్యాంగ్.. ఓలేటి హైదరాబాద్ టెకీలకు మెపిడ్రిన్ డ్రగ్ అందజేసినట్లు నిర్ధారణ అయింది.
Also Read:Cheating: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. మైనర్ బాలికను గర్భవతిని చేసి.. చివరకు
ల్యాబ్ లో మెపిడ్రిన్ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు, రసాయనాల డ్రమ్ములను మహారాష్ట్ర తరలించారు. గత ఏడాది తెలంగాణలో 107 కిలోల మెపిప్రిన్ సీజ్ చేసిన తెలంగాణ నార్కోటిక్స్ పోలీస్.. శ్రీనివాస్ ఓలేటి విజయ్ నెట్వర్క్ పై గతంలో దృష్టి సారించిన తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు.. ముంబై, గోవా, బెంగళూరుకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. చర్లపల్లితోపాటు, నాచారం, మల్లాపూర్ పారిశ్రామిక వాడల్లో ఉన్న కంపెనీలు ఏయే ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి? కాలిగా ఉన్న కంపెనీల చిట్టాపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.