ఇరాన్ అణు కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా మిడ్నైట్ హామర్ అనే చారిత్రాత్మక సైనిక చర్యను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో, 7 B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లు 14 GBU-57 మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ (MOP) బాంబులను ఇరాన్ అత్యంత సురక్షితమైన అణు స్థావరం అయిన ఫోర్డోపై జారవిడిచాయి. మాక్సర్ నుంచి వచ్చిన తాజా ఉపగ్రహ చిత్రాలు ఫోర్డో ఎగువ శిఖరంపై కనీసం 6 ఆయుధ ప్రవేశ రంధ్రాలు/క్రేటర్లను చూపిస్తున్నాయి. ఈ దాడులలో ఇరాన్ భారీ నష్టాలను […]
అమెరికా B-2 బాంబర్లను ఉపయోగించి ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై దాడి చేసింది. ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లోని అణు కేంద్రాలను నాశనం చేశామని అమెరికా పేర్కొంది. కానీ ఇరాన్ తమకు ఎటువంటి పెద్ద నష్టం జరగలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో రేపు (సోమవారం) మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలుస్తానని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి తెలిపారు. Also Read:Hormuz Strait: ఇరాన్ సంచలన నిర్ణయం.. హార్ముజ్ జలసంధి మూసివేత.. ఇదిలా ఉండగా, అనేక […]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేసినందుకు పాకిస్తాన్ ప్రభుత్వం, దాని సైన్యం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాయి. ఇటీవలి భారతదేశం-పాకిస్తాన్ వివాదంలో ‘నిర్ణయాత్మక దౌత్య జోక్యం’ కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతిని సిఫార్సు చేస్తూ పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ అధికారికంగా నార్వేలోని నోబెల్ శాంతి బహుమతి కమిటీకి ఒక లేఖ పంపారు. పాకిస్తాన్ ప్రభుత్వం […]
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఈ క్రమంలో అమెరికా ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై వైమానిక దాడులు చేసింది. ఇది ఉద్రిక్తతను మరింత పెంచింది. అమెరికా ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ దాడిలో B-2 స్టెల్త్ బాంబర్లను ఉపయోగించారు. ఇరాన్‌లోని పర్వతాల కింద 80 శాతం లోతులో ఉన్న ఫోర్డో అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంది. యుఎస్ బి-2 బాంబర్ […]
అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయీద్ అబ్బాస్ అరఘ్చి ఆదివారం ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేయడాన్ని ఖండించారు. ఇది అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యుడైన అమెరికా అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా “నేరపూరిత ప్రవర్తన” కలిగి ఉందని అరఘ్చి ఆరోపించారు. “ఈ ఉదయం జరిగిన సంఘటనలు రెచ్చగొట్టేవి, దీర్ఘకాలిక […]
ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం చాలా ప్రమాదకరమైన దశకు చేరుకుంది. ఆదివారం ఉదయం, అమెరికా ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసింది. అమెరికా చర్య తర్వాత, ప్రపంచంలో కలకలం రేగింది. ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో ఫోన్లో మాట్లాడారు. ప్రధాని మోదీ ఈ సమాచారాన్ని ఎక్స్ పోస్ట్ ద్వారా పంచుకున్నారు. ‘నేను ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో మాట్లాడాను. ప్రస్తుత పరిస్థితిపై వివరంగా చర్చించాము. […]
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంలోకి అమెరికా ప్రవేశించడం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను పెంచింది. కాగా గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ అమెరికాను ప్రశంసించడంలో మునిగిపోయింది. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వైట్ హౌస్‌లో విందు చేశారు. ట్రంప్‌ను సంతోషపెట్టడానికి, మునీర్ తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. నిన్న, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ కూడా దీనికి మద్దతు ఇచ్చారు. Also Read:Reza Shah Pahlavi: ఖమేనీ రాజీనామా […]
ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలు – ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లపై అమెరికా దాడులకు ఇస్లామిక్ రిపబ్లిక్ అణు ఆశయాలే కారణమని బహిష్కృత క్రౌన్ ప్రిన్స్ రెజా షా పహ్లవి ఆరోపించారు. సుప్రీం నాయకుడు ఖమేనీ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై దాడిపై స్పందిస్తూ, రెజా షా పహ్లవి Xలో ఇలా రాసుకొచ్చారు.. “ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై దాడులు ఇస్లామిక్ రిపబ్లిక్ అణ్వాయుధాల కోసం చేసిన వినాశకరమైన ప్రయత్నం ఫలితంగా […]
వివో ఎక్స్ ఫోల్డ్ 5 త్వరలో లాంచ్ కానుంది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్ చేయనుంది. ఈ బ్రాండ్ తన రాబోయే ఫోల్డింగ్ ఫోన్ Vivo X Fold 5 ను త్వరలో తీసుకురానుంది. నివేదికల ప్రకారం Vivo X Fold 5 జూలైలో భారత్ లో లాంచ్ కావచ్చు. ఈ హ్యాండ్ సెట్ కి 6000mAh బ్యాటరీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఫోన్ వైర్డు, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ […]
ఎయిర్ ఇండియాపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కఠిన చర్యలు తీసుకుంది. సిబ్బంది షెడ్యూలింగ్ విభాగానికి చెందిన ముగ్గురు సీనియర్ అధికారులను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. విమానయాన భద్రతా ప్రోటోకాల్‌లను తీవ్రంగా ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. బాధ్యత వహించిన అధికారులలో చురా సింగ్ (డివిజనల్ వైస్ ప్రెసిడెంట్), పింకీ మిట్టల్ (చీఫ్ మేనేజర్ – క్రూ షెడ్యూలింగ్), పాయల్ అరోరా (క్రూ షెడ్యూలింగ్ – ప్లానింగ్) ఉన్నారు. ఈ అధికారులను వెంటనే […]